- బలిదానలు చేస్తూ బూడిద కావొద్దురా:
- ================================
“విధ్యార్థులంటె నేల తల్లి లాంటి వాళ్ళురా
జాతి భారన్నంత భుజాన మోసేటోళ్ళు రా
విధ్య దశ నుండే విశ్వవిజేతలవుతారు
రావివేకనందుడికి ఆనవాళ్ళు మీరు రా ”
ప్రశ్నించెటోళ్ళు మీరు- ఆ ప్రశ్నకు బదులు మీరు
ప్రశ్న జవాబులతో -ప్రణాళికలు రాసెటోళ్ళు
బలిదానలు చేస్తు బూడిద కావొద్దురా
నడిపించేటోళ్ళు మీరు- తూలి పడితే ఎట్లారా?
మిమ్ముల నమ్ముకున్న వాళ్ళు నడువలేరురా
కన్నీళ్ళు తుడిచే మీరు తూలి పడితే కాటికెల్తే ఎట్లారా?
నాలుగు కోట్ల ప్రజలు భాధపడుతారురా
వేదన తీర్చుట కై ఆవేదన చెందినోళ్ళు
ఆవేశపూరితంగా ఆహుతైతే ఎట్ల రా
from: https://engineerchandu.wordpress.com/
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి