మన మువ్వన్నెల పతాకం

India is best - MOBANGO - Free
mobile applications, games, themes, ringtones, wallpapers and videos
for your mobile phone

22, జులై 2016, శుక్రవారం

కృష్ణమ్మా గోదారమ్మా కదిలి వస్తనన్నది

కృష్ణమ్మా గోదారమ్మా కదిలి వస్తనన్నది               కన్నీరొద్దంటున్నది               చల్లగాలి వీచి పోరుకు ఊపిరైతానన్నది               అది పురుడు పోస్తనన్నది               పండూ వెన్నెల కాసి పల్లె               నడుగుతున్నది తెలంగాణ కావాలన్నది || కొమ్మలల్లో ||
చరణం
4: అడవిలున్న ఆకులన్ని అలకిడి జేస్తున్నయి               అలాయ్ భలాయ్ తీసుకున్నయి               చీమలన్ని జంట వట్టి ర్యాలి తీస్తనన్నయి               మేం రణం జేస్తనన్నయి               చెట్టుకొమ్మలన్ని తీసి చాకులౌతమన్నయి               బందూకులెత్తమన్నయి               వడ్లపిట్ల ముక్కుతోటి గన్నుజేస్తనన్నది               తెలంగాణను దెమ్మన్నది ||కొమ్మలల్లో |

అ) తెలంగాణా పోరాట నేపథ్యంలో వచ్చిన పాటలు

               పిడికేడంత లేని పిచ్చుక పోరు జేస్తనన్నది               పోరుబాటనైతనన్నది               చెట్టుచేమలన్ని ఊగి ఊపిరి పోస్తమన్నయి               ఉద్యమాలు జేస్తమన్నయి               పోడిసేటి పొద్దుగూడ పొత్తుగూడుతనన్నది               పోరుకు సై అన్నది || కొమ్మాలల్లో ||
చరణం
2: నక్క బావా జిత్తులతో చిత్తుజేస్తనన్నది                పేద్ద ప్లాను గీస్తనన్నది                తెలంగాణ సమరానికి సాల్ల సై అన్నది                అది సవాల్ జేస్తనన్నది                పావురాలు ఏకమయి కబురు తెస్తమన్నయి                కాపాడుకుంటమన్నయి                జీవరాశులు ఒక్కటై జండా వట్టుతున్నయి                జేజేలు వలుకుతున్నయి || కొమ్మలల్లో ||
చరణం
3: నారుమడిలో నీరునైతే వాటా వంచమన్నయి               వాగు వంకలడుగుచున్నయి

అ) తెలంగాణా పోరాట నేపథ్యంలో వచ్చిన పాటలు

) తెలంగాణా పోరాట నేపథ్యంలో వచ్చిన పాటలు
పాట - 1పల్లవి: కొమ్మాలల్లో కోయిలమ్మా పాట వాడుతున్నది జై తెలంగాణ అన్నది          అలసిపోయిన లేడీ కూన గంతులేస్తనన్నది కాలి గజ్జె కడుతునన్నది          పాణం పోయే మేకపిల్ల డప్పునైతనన్నది దండోర వేస్తనన్నది          ఇప్పుడు పుట్టిన లేగదూడ దుంకులాడుతన్నది          ధూం... దాం... చేస్తానన్నది ||కొమ్మ||చరణం 1: గొర్కోళ్లు వొడవంగ కూత వడుతనన్నది               కోడి నిదుర లేపుతున్నది
==========================================

Telangana Songs

“విధ్యార్థులంటె నేల తల్లి లాంటి వాళ్ళురా

బలిదానలు చేస్తూ బూడిద కావొద్దురా:
================================

“విధ్యార్థులంటె నేల తల్లి లాంటి వాళ్ళురా
జాతి భారన్నంత భుజాన మోసేటోళ్ళు రా
విధ్య దశ నుండే విశ్వవిజేతలవుతారు
రావివేకనందుడికి ఆనవాళ్ళు మీరు రా ”
ప్రశ్నించెటోళ్ళు మీరు- ఆ ప్రశ్నకు బదులు మీరు
ప్రశ్న జవాబులతో -ప్రణాళికలు రాసెటోళ్ళు
బలిదానలు చేస్తు బూడిద కావొద్దురా

నడిపించేటోళ్ళు మీరు- తూలి పడితే ఎట్లారా?
మిమ్ముల నమ్ముకున్న వాళ్ళు నడువలేరురా
కన్నీళ్ళు తుడిచే మీరు తూలి పడితే కాటికెల్తే ఎట్లారా?
నాలుగు కోట్ల ప్రజలు భాధపడుతారురా
వేదన తీర్చుట కై ఆవేదన చెందినోళ్ళు
ఆవేశపూరితంగా ఆహుతైతే ఎట్ల రా 
                                                                    from: https://engineerchandu.wordpress.com/

నా ఊరు

నా ఊరు...

నేనెళ్ళిపోయానన్న బాధేమో

ఊరి మధ్య రావిచెట్టు
ఆకురాల్చేసింది

తన అవసరం లేదనుకుందేమో
రచ్చబండ బీటలేసింది

గుడి మెట్టు,చెరువు గట్టు
నాకోసమే ఎదురుచూస్తున్నట్టున్నాయి

జామచెట్టుకేసిన ఊయల
కిర్రు చప్పుళ్ళ ఊసేలేదు

ఇక రాననుకున్నారో ఏమో
అయినవాళ్ళు కొందరు
చెప్పకుండానే దాటిపోయారు

ఇపుడా ఊరు
నా చరిత్రకి
శిధిల సాక్ష్యంగా మాత్రమే మిగిలింది

తిరిగి వెళ్ళకపోయినా బాగుండును
జ్ఞాపకాల్లో అయినా సజీవంగా వుండేది నా ఊరు

                 from: http://snehama.blogspot.in/2009/08/blog-post.html
                                 
Maa Uri Chitraalu

16, జులై 2016, శనివారం

దాశరధి రంగాచార్య... జీవనయానం

డాక్టర్‌ దాశరథి రంగాచార్య 'జీవన యానం' వార్త ఆదివారం అనుబంధంలో 103 వారాలపాటు ధారావాహికంగా ప్రచురించబడింది.
చినగూడూరులో పుట్టి, భాగ్యనగరంతో పెనవేసుకుపోయిన జీవితం కర్మయోగిలా గడుపుతున్న రంగాచార్య ఆత్మకథ 'జీవనయానం'. ఇందులో ఆరాటం ఉంది. పోరాటం ఉంది. కలలున్నాయి. కన్నీళ్ళున్నాయి. గెలుపు ఓటముల తారట్లాట ఉంది. ముషాయిరాలా హాయిగా కొన్నిచోట్ల, గజల్‌లా గంభీరంగా మరికొన్నిచోట్ల, కొండలు, గుట్టలు ఢీ కొంటూ కొన్నిచోట్ల, ఒదిగిపోతూ, మలుపులు తిరుగుతూ, ఇంకొన్ని చోట్ల సాగిన జీవనది ప్రవాహం ఆయన జీవితం. తన జీవితంలో భీభత్సానికి, భయాలకు, సాహసాలకు, విజయాలకు, విషాదానికి, సంతోషానికి అక్షర దర్పణం పట్టి సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో రచన సాగించారు.
ఇందులో కేవలం రంగాచార్య జీవితమే కాదు, ఏడు దశాబ్దాల తెలుగుజాతి జీవన చిత్రణ ఉన్నది. స్వతంత్ర పోరాటం, రజాకార్ల దౌష్టం, కమ్యూనిస్టుల సారధ్యంలో తెలంగాణా సాయుధపోరాటం, ప్రత్యేక తెలంగాణా, ప్రత్యేక ఆంధ్ర ఉద్యమాలు, సాహిత్యోద్యమాలు...అన్నీ ఉన్నాయి.....
తెలంగాణ తొలితరం సాహితీవేత్త, సాయుధ పోరాట యోధుడు, నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన ధీరుడిగా ఎంతో ప్రాముఖ్యత పొందారు రంగాచార్యులు. ఉపాధ్యాయుడిగా, లైబ్రేరియన్ గా పనిచేసిన రంగాచార్యులు అన్న ప్రముఖ కవి, సాయుధ పోరాట యోధుడు దాశరథి కృష్ణమాచార్యులు. సాయుధపోరాటం ముగిసిన తర్వాత సికింద్రాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ లో 32 ఏళ్ళు పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు దాశరధి.
దాశరథి రంగాచార్యులు తండ్రి సనాతనవాది. అన్న ప్రముఖకవి, అభ్యుదయవాది కృష్ణమాచార్యుల నీడలో.. అభ్యుదయ భావాలు, విప్లవ భావాలను వంటపట్టించుకున్నారు. 1945లో మొదలైన తెలంగాణ సాయుధ పోరాటంలో కృష్ణమాచార్యులను అరెస్టు చేయడంతో చిన్నవయసులోనే రంగాచార్యులు కుటుంబ బాధ్యతలను స్వీకరించారు. ఓవైపు ఉపాధ్యాయునిగా పనిచేస్తూనే సమాజంలో అసమానతలపై ప్రజలను చైతన్యపరిచారు. రంగాచార్యుల కుటుంబంపై నైజాం ప్రభుత్వ అనుకూలురు, భాగస్వాములు దాడిచేసినా వెనకడుగు వేయలేదు. తెలంగాణా సాయుధ పోరాటం నాటి పరిస్థితులను దాశరథి రంగాచార్యులు ‘చిల్లర దేవుళ్ళు‘, ‘మోదుగుపూలు‘, ‘జనపదం‘ నవలల్లో అక్షరరూపం ఇచ్చారు. ‘చిల్లర దేవుళ్లు‘ నవలలో సాయుధపోరాటం ముందు స్థితిగతులు, ‘మోదుగుపూలు‘ నవలలో తెలంగాణ సాయుధ పోరాటకాలం నాటి పరిస్థితులు, ఆతర్వాత పరిస్థితులు జనపదంలో రాశారు. తొలుత కమ్యూనిస్టు భావజాలంతో ప్రభావితమైన రంగాచార్యులు తర్వాత ఆధ్యాత్మిక భావాలను అలవరుచుకున్నారు. శ్రీమద్రామాయణం, శ్రీ మహాభారతాలను సరళంగా తెలుగులో రచించారు.
తెలుగు సాహిత్య చరిత్రలోనే తొలిసారిగా నాలుగు వేదాలను తెలుగులోకి రచించిన ఘనాపాటి రంగాచార్యులు. తెలుగు భాషలో విశిష్టమైన సాహిత్యాన్ని సృష్టించి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. తెలంగాణ ప్రాంత చారిత్రక, సామాజిక, రాజకీయ పరిణామాలకు ప్రతిబింబంగా రచించిన ఆత్మకథ “జీవనయానం” సాహిత్యంపై చెరగని ముద్ర వేసింది. వేదం లిపిబద్ధం కారాదనే నిబంధనల్ని పక్కన పెట్టి ఏకంగా తెలుగులోకి అనువదించడం వంటి విప్లవాత్మకమైన పనులు చేపట్టారు. తెలుగులోకి వేదాలను అనువదించిన వ్యక్తిగా ఆయన సాహిత్య చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. దాశరథి రంగాచార్యుల “చిల్లర దేవుళ్లు” నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు. వేదాలను అనువదించి, మహాభారతాన్ని సులభవచనంగా రచించినందుకు గానూ రంగాచార్యులకు  అభినవ వ్యాసుడు బిరుదు ప్రదానం చేశారు..

15, జులై 2016, శుక్రవారం

కాళోజి నాగొడవ

కాళోజి నాగొడవ :

ఒక్క సిరా చుక్క
వెయ్యిమెదళ్ళ కదలిక- అంటాడు కాళోజి.
తెలుగు సమాజంలో ప్రజా సమస్యలను చూసి తన రచనా ప్రక్రియ ద్వారా అనేక మంది మెదళ్ళను కదిలించి చైతన్యవంతం చేసిన కార్యశీలి కాళోజి. కాళోజి ఆశు కవి. ఆశువుగా అనేక కవితల్ని తన గళం నుండి జారవిడిచాడు. సమాజంలో అన్యాయం ఎక్కడుంటే అక్కడ ఆయన కవిత అక్కడుంటుంది. ఆయన మాట అక్కడుంటుంది. భారత రాజ్యాంగం ప్రకారం మనిషికి అనేక హక్కులు ఏర్పడ్డాయి అని, ఆ హక్కులను హరించే హక్కు ప్రభుత్వానికి ఎక్కడుంది?- అని మానవ హక్కుల కోసం అనేక సార్లు జైలు పాలయ్యారు. తెలంగాణలో జరుగుతున్న అణచివేతకు, దోపిడీకి, అక్రమాలకు ఎగిరే ధిక్కార పతాకమైండు. బడి పలుకుల భాష కాదు మాకు కావల్సింది, పలుకుబడుల భాష కావాలని ప్రశ్నించిన వ్యక్తి కాళోజి నారాయణ.

కాళోజి జీవిత ప్రస్థానం దాదాపు 10 దశాబ్దాల కిందట కన్నడ ప్రాంతంలో ప్రారంభమైంది. 1914 సెప్టెంబర్‌ 9న బీజాపూర్‌ జిల్లాలోని రట్టహాళి గ్రామంలో జన్మించాడు. తండ్రి రంగారావు, తల్లి రమాబాయి. కాళోజి జననం తర్వాత రెండు సంవత్సరాలు వారి కుటుంబం హన్మకొండ దగ్గర కాజీపేటకు సమీపంలోని మడికొండకు వచ్చి స్థిరపడింది. కాళోజీ అసలు పేరు రఘువీర్‌ నారాయణ్‌ లక్ష్మీకాంత్‌ శ్రీనివాస రావు రాజా కాళోజి. ఇంత పెద్ద పేరు ఇబ్బందని కాళోజి నారాయణ రావుగా మార్చుకున్నారు. ఈయన అమ్మ రమాబాయమ్మ కన్నడ ప్రాంతం- తండ్రి రంగారావు మహారాష్ట్ర కు చెందిన వ్యక్తి. వీరికి ఇద్దరు సంతానం. వీరిలో పెద్దవాడు కాళోజి రామేశ్వర రావు- షాద్‌ అనే కలం పేరుతో ఉర్దు కవిగా పేరు ప్రఖ్యాతులు పొందారు. రెండవ వ్యక్తి కాళోజి నారాయణ రావు. తల్లి కన్నడం తండ్రి మహారాష్ట్ర కావడంతో కాళోజి రెండు భాషల్లో పట్టు సాధించి, తెలంగాణ ప్రాంతంలో స్థిరపడటం వల్ల తెలుగులో కూడా మంచి ప్రావీణ్యం పొందారు. ఒక్క సిరా చుక్క వెయ్యిమెదళ్ళ కదలిక అంటాడు కాళోజి.

రచనలు:
ప్రజాకవి కాళోజి ప్రజల కష్టాలను పంచుకున్న వ్యక్తి. సమాజంలో నాటి తెలంగాణ ఉద్యమంలో తాను అనుభవించిన అనేక సంఘటనలను, ప్రజల బాధలను చూసి చలించాడు. ఇలా సమాజంలో దుర్మార్గాన్ని కడతేర్చడానికి కాళోజి తన కవిత్వాన్ని ఆయుధంగా వాడుకొని తన కలంతో, గళంతో అనేక రచనలను జాలువారించాడు. అందులో అణా కథలు (1941), కాళోజి కథలు (1945), పార్థిక వ్యయము (1948), నా గొడవ (1953), జీవన గీతాలు (1968), తెలంగాణ ఉద్యమ కవితలు (1969) కాళోజి కథలు (2000), తుది విజయం మనది నిజం, నా గొడవ పరాభవ వసంత, నాగొడవ పరాభవ గ్రీష్మం, నాగొడవ పరాభవ వర్షం, నాగొడవ పరాభవ శరత్తు, నాగొడవ పరాభవ హేమంతం, నాగొడవ పరాభవ శిశిరం, బంగ్లాదేశ్‌ కవితలు, మరాఠి భాష నుండి ఎన్‌. జి. ఫడ్కే నవల (అంజలి), సానే గురుజీ రచనలను (భారతీయ సంస్కృతి) కాళోజి సరళమైన తెలుగులోనికి అనువదించారు. తెలంగాణ సామాజిక, రాజకీయ, సాహిత్య ఉద్యమాలను, చరిత్రకు దర్పణంగా కాళోజి చెపుతుండగా తూర్పు మల్లారెడ్డి తన ఆత్మకథను- నా గొడవ- అను పేరుతో రాశారు కాని, అది అసంపుర్ణం, ఇలా దాదాపు 70 రచనల వరకు రచించగా, వీటిలో మనకు కొన్ని మాత్రమే లభ్యమవుతున్నాయి.

కాళోజి తెలుగు వాడా?:
అసలు కాళోజి తెలుగు వాడా అనే చర్చ కొన్ని రోజులు అనేక విమర్శలకు దారి తీసింది. తండ్రి మహారాష్ట్ర, తల్లి కర్ణాటక. వీరిద్దరు వేర్వురు ప్రాంతాలకు చెందినవారు వలస కోసం వరంగల్లుకు వచ్చారు కాబట్టి ఈయన తెలుగు వాడు ఎలా అవుతాడు, తెలుగు వాడు కాని వ్యక్తిని ప్రజాకవిగా తెలుగులో ఎలా గుర్తిస్తారు? అని చాలా మంది వ్యతిరేకించారు. కాని దీన్ని చాలా మంది కవులు, పండితులు, నాయకులు ఖండించారు. తన తల్లి తండ్రిది కర్ణాటక, మహారాష్ట్ర కావచ్చు కాని తాను తెలంగాణ ప్రాంతంలో పుట్టి పెరిగి ఇక్కడి మట్టిలోనే జీవనం కొనసాగించాడు. మానవ హక్కుల నేతగా తెలుగు సమాజంలో జరుగుతున్న అన్యాయాలకు అడ్డు నిలిచి నిజాం సర్కారును సైతం వ్యతిరేకించిన ధిక్కార స్వరం కాళోజి. ప్రజలే ఊపిరిగా భావించి ఎక్కడ అన్యాయం, అణచివేత జరిగితే తన సాధ్యా సాధ్యాల మేరకు తన కలంతో, గళంతో సామాన్య ప్రజల చెంత చేరి వరంగల్‌ నగర బహిష్కరణకు కూడా గురై, ఎంతో మంది ప్రజాసంఘాలవారితో కలిసి అనేక విషయాలపై అనర్గళంగా మాట్లాడిన వ్యక్తి కాళోజి. అలాంటి వ్యక్తి తెలుగు వాడు కాడా, తెలంగాణ వాడు కాదా- అని అంటే తెలుగు వాడే, తెలంగాణ వాడే అని నిక్కర్షగా చెప్పవచ్చు.

కవిగా కాళోజి:
వరంగల్‌ జిల్లా కొంత చైతన్యవంతమైన జిల్లా. అనేక మంది కవులకు పురిటి గడ్డ. అలాంటి ప్రాంతంలో కాళోజి కవిగా తొలి అడుగులు వేయడానికి- కొంత మంది పెద్దల ప్రభావం కూడా అతని పై పడింది. ముఖ్యంగా కాళోజి గార్లపాటి రాఘవరెడ్డితో ఉన్న సహచర్యం వల్ల కవితా రచనకు ప్రేరణ కల్గింది. రాఘవరెడ్డి యే కవితా రచనకు సంబంధించిన యతి, ప్రాసల ప్రయోగ విధానాన్ని గూర్చి మాత్రా ఛందస్సుల నడకలను గూర్చి నేర్పారు. నిరంతర అభ్యాసంతో తన కవితా రచనకు ఒరవడి దిద్ది, ఆనందమో, ఆవేదనో కలిగినప్పుడల్లా, తనకు వచ్చిన భావాలను కవితా రూపంలో వ్యక్తం చేశాడు కాళోజి (నా గొడవ 1953 కాళోజి పీఠిక నుండి). ప్రపంచం బాధంతా శ్రీశ్రీ బాధ అయితే, కాళోజి గొడవంతా సగటు మనిషి గొడవ. అందుకే కాళోజి ప్రజాకవి అయినాడు. సామాన్య ప్రజల బాధలను వారికి అర్థమయ్యే విధంగా సులభ పదాలతో అతి సున్నితంగా ప్రజలకు చేరవేసేవాడు. అందుకే ప్రజలకు అంత దగ్గరయ్యాడు అనడంలో ఆశ్చర్యం లేదు. ఏ సాహిత్య ప్రక్రియలో అయినా రెండు ప్రధాన అంశాలు ఉంటాయి. ఒకటి వస్తువు అయితే, రెండవది శిల్పం. గొప్ప రచనల్లో ఈ రెండు దేనికదే చలామణి అవుతూ ఒకే విధంగా కలిసిపోతాయి. వాస్తవానికి ఈ రెండు వేర్వేరు కావని, ఒకటేనని గొప్ప కవిత్వంలో ఈ రెండు కలిసి పోతాయని విమర్శకులంటారు. ఈ రెండింటిలో కాళోజి- ఏం చెబుతున్నామన్నది ముఖ్యం కాని, ఎట్లా చెపుతున్నామన్నది ముఖ్యం కాదు అంటాడు. అంటే భాష విషయంలో తగిన జాగ్రత్త వహించలేదు. సాదా సీదా మాటలలో తన కవిత్వాన్ని ప్రజల దగ్గరకు తీసుకెళ్ళాడు. ఈ విషయానికి వస్తే కాళోజి వేమన, శ్రీశ్రీ మార్గాన్నే ఎంచుకున్నాడని చెప్పవచ్చు.

నాకున్నది కోరిక / నా గొడవ నీకు రాసిన ఉత్తరంగా ఉండాలని / చదువులకు కవిత్వంగా ఉండాలని/ భావుకులకు మెదడుగా ఉండాలని/ అమాయకులకు ఆపద గుర్తించేదిగా ఉండాలని/ విచ్చలవిడి ఆంబోతులకు గుదిబండగా ఉండాలని/ నాకున్నది కోరిక.
కవిత్వం అనేది నిరంతర ప్రవాహి. నిత్యం గోదావరిలా పొర్లి పొంగుతూ ఆనందపు, బాధల గాథలతో సాగిపోతుంది. కాని కవిత్వం అనేది- కళ కళ కోసంగా కాకుండా, ఎదుటి వ్యక్తికి ప్రతీకగా, ప్రజల పక్షాన నిలబడి ఆంబోతులకు గుదిబండగా ఉండాలని అంటాడు. అంటే కళ కళ కోసం కాదు- కళ ప్రజల కోసం ఉండాలంటాడు కాళోజి.
ప్రజలను హింసించు ప్రభువు మాకేల
వధియింప భక్షింప వన రాజులేడా.
నిజాం రాజరికంలో ప్రజలపై అణచివేత, దోపిడీ, హింసా ఖండనలు, మానభంగాలు ప్రతి రోజు కొనసాగుతుంటే నిజాం ప్రభువు తనకేమి సంబంధం లేనట్టు తన సంస్థానంలో హాయిగా రాణివాసంలో కులుకు తున్నాడు. ప్రజల యోగక్షేమాలకే పరిపాలనా విధానం ఉండాలి కాని భక్షించటానికి కాదని నిజాం రాజును ప్రశ్నించాడు.

తెలంగాణ పై కాళోజి అభిప్రాయం:
తెలంగాణ సాహిత్యంలో కాళోజికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. తెలంగాణ సాహిత్యం అనగానే మొదటి వరుసలో ఉండే వ్యక్తి కాళోజి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం అహర్నిశలు ఆశపడి తెలంగాణనే ఊపిరిగా, తుది శ్వాస వరకు తెలంగాణను సాధించుకోవాల్సిన అవసరం ఉందన్న వ్యక్తి ప్రజాకవి కాళోజి. పెద్ద మనుష్యుల ఒప్పందం ప్రకారం కొన్ని షరతులతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ తో కలిసినది. పెద్దమనుష్యుల ఒప్పందంలో నాలుగు ప్రధాన అంశాలు.
1. తెలంగాణ ప్రాంత విధాన సభ్యులు తెలంగాణ ప్రాంతీయ సంఘానికి సభ్యులుగా ఉండగలరు. ప్రాంతీయ సంఘం తెలంగాణ అభివృద్ధి నిమిత్తం విధానాలను రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేయవలెను. 2. తెలంగాణ మొత్తం ఆదాయంలో కొంత రాష్ర్టం పై వ్యయం కాగా, మిగులు నిధులు తెలంగాణ ప్రాంత అభివృద్ధి నిమిత్తం వ్యయం చేయవలె. 3. కొన్ని ప్రభుత్వ ఉద్యోగాల నియమాలకు తెలంగాణ ప్రాంతంలో 15 సంవత్సరాల నుండి నివసించే వ్యక్తులనే నియమించాలి. 4. తెలంగాణ ప్రాంతీయుని ముఖ్యమంత్రిగా లేదా ఉప ముఖ్యమంత్రిగా నియమించాలి.

- ఈ ఒప్పందం ప్రకారం పరిపాలన జరగలేదు. తెలంగాణలో అనేక మంది యువకులు, విద్యార్థులు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. నకిలి ముల్కి ద్వారా ఆంధ్ర ప్రాంతపు వ్యక్తులే అనేక ఉద్యోగాల్లో స్థిరపడిపోతున్నారు. తెలంగాణ ఎన్‌.జి.వొ. లకు ప్రమోషన్లు లేవు. అనేక సంవత్సరాలు గడిచినా సీనియార్టి లిస్టు తయారు కాలేదు. దీంతో పాటు తెలంగాణ భాష, యాస విషయంలో చిన్న చూపును చూసి కాళోజి తీవ్ర అసంతృప్తికి గురయ్యాడు. అందుకే తన కలంతో అనేక తూటాలు పేల్చాడు. బూర్గునాటి ఒప్పందం, బట్టదాఖలైనప్పుడు/ విన్నపాలు విజ్ఞప్తులు, వినునాధులే లేనప్పుడు/ తెలంగాణ సిబ్బందిది త్రిశంకు గతి అయినప్పుడు - అంటూ తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని చూసి చలించిపోయాడు. ఒప్పుకున్న ఒప్పందం ప్రకారం తెలంగాణకు రావలసినవి అడుగుతే అసలు వినే నాధుడే లేడు- అని ఇంతటి దుర్మార్గపు పరిస్థితి ఇంకోటి ఉండదంటూ కలతచెందాడు. తెలంగాణ బలము జాడ ఇల కడుపున మెదలుతాంది/ తెలంగాణ కృష్ణుడి వలె, మొలుస్తోంది జైలు లోన/ బ్రహ్మనందుడు కంసుడు, బలుస్తాండు జేలివతల- 1969 లో తెలంగాణ ఉద్యమం ఒక పెను తుఫానులా వచ్చింది. తెలంగాణ రాష్ట్రం పురుటి నొప్పులు పడుతున్నదని, పాలించే రాషా్టన్న్రి ప్రశ్నించే యువకులు తయారయ్యారని ఇతిహా స పాత్రలతో కాళోజి- కౌరవులు ఎంత మంది ఉన్నా, ఎన్ని ఎత్తులు వేసినా చివరకు పాండ వులే నిలిచారని, తెలంగాణలో కూడా అంతే అంటూ- ఈ ప్రాంతాన్నేలే ముఖ్యమంత్రిని గద్దె దించడానికి తెలంగాణ ప్రజానీకం బలపడుతుందని తెలుపుతున్నాడు.

రెండున్నర జిల్లాలదె, దండి భాష అయినప్పుడు/ తక్కినోళ్ళ నోళ్ళ యాస, తొక్కి అణచబడ్డప్పుడు/ ప్రత్యేకంగా రాజ్యం పాలు, అడగ తప్పదన్నాడు. తెలంగాణకు భాష విషయంలో తీవ్ర అన్యాయం జరిగింది. ఒకే రాష్ట్రంలో ఉన్న ప్రజల భాష అందరికి సౌకర్యంగా ఆమోదయోగ్యంగా ఉండాలి కాని, కేవలం రెండున్నర జిల్లాల భాషనే ప్రామాణిక భాష అనడం ఎంత వరకు సమంజసం? నా తెలంగాణ భాషను, యాసను అణచివేయడం, కించపరచడం, తొక్కివేడం ఎందుకు? అని ప్రశ్నించి, మా భాషకు ప్రత్యేక ప్రాధాన్యత ఉన్నదని, మీతో మాకేంటి అని- ప్రత్యేక తెలంగాణ రాష్ర్టం ఉండాల్సిన అవసరం అని చెప్పారు. అలాగే భాష విషయంలో తప్పొప్పులను చెబుతూ- చాయ్‌ అంటే తప్పా, టీ అంటే రైటా/ నాష్ట అంటే తప్పా, టిఫిన్‌ అంటే రైటా/ సడక్‌ అంటే తప్పా, రోడ్డంటే రైటా? సీమాంధ్ర వారు- మీరు ఎక్కువ ఉర్దూ పదాలు ఎక్కువ వాడతారు, మీ భాష సరికాదు - అన్నప్పుడు కాళోజి మీరు ఇంగ్లీష్‌ పదాలు ఎందుకు వాడుతున్నారు, మీదేమో రైటు, మాదేమో తప్పా అంటూ ప్రశ్నించాడు. అందుకే భాష విషయంలో బడి పలుకుల భాష మీదైతే పలుకుబడుల భాష మాదన్నాడు. ప్రాంతేతరుడే దోపిడీ చేస్తే/ దూరం దాక తన్ని తరుముతాం/ ప్రాంతీయుడే దోపిడీ చేస్తే/ ప్రాంతంలోనే పాతర వేస్తాం. - ఈ సమాజంలో దోపిడీ చేసే వాడు మనవాడు కావచ్చు, పక్క రాష్ట్రం వాడు కావచ్చు. ఎవడైనా ప్రజలకు అన్యాయం చేస్తే తరిమేయడమో, పాతరేయడమో తప్పదని సూటిగా చెప్పిన వ్యక్తి కాళోజి.                                        SURYA News paper 2014
===================================================================
http://www.koumudi.net/Monthly/2014/may/may_2014_vyAsakoumudi_kaloji.pdf
=========================================================================
కాళోజి

`ప్రభుత్వ టెర్రరిజాన్ని విమర్శించే మీరు పద్మ విభూషణ్ ఎందుకు పుచ్చుకున్నార`ని అడిగాను. కాళోజి అందుకు సంజాయిషీ కథ చెప్పారు. వరంగల్లులో వుంటున్న తనకు ప్రధాని పి.వి. నరసింహారావు నుండి ఫోను వచ్చిందట. ఇంట్లో ఫోను లేనందున, కలెక్టరేట్ కు ఫోను చేసి పిలిపించమన్నారట. డెఫ్యూటి కలెక్టర్ జీపులో వచ్చి కలెక్టర్ గారు పిలుస్తున్నారు రమ్మంటే, సరేనని జీపు ఎక్కి, అడిగారట. నన్ను ఎన్ కౌంటర్ చేయడానికి తీసుకెడుతున్నారా అని. ఆయన నవ్వి. లేదండీ, ఢిల్లీ నుండి మీకు ఫోను వచ్చిందట, అందుకని అన్నారట. కలెక్టరేట్ లో సాదరంగా ఆయన్ను కూర్చోబెట్టి, ప్రధాని నరసింహారావుకు ఫోను కలిపారట. కాళన్నా, నీవు అన్నీ వద్దంటావు. కాని యీ సారి అలా అనొద్దు. పద్మ విభూషణ్ స్వీకరించడానికి ఒప్పుకో అంటే, కాళోజీ `సరే` అన్నారట.
పి.వి. నరసింహారావు, కాళోజీ చిరకాల మిత్రులు. ఒరే అనే టంత చనువు వున్న స్నేహితులు, దీని వెనుక వేరే కథ వుంది. స్టేజి, డ్రామాలలో ఆరితేరిన ఎ.ఆర్. కృష్ణకు పద్మభూషణ్ యివ్వమని సిఫారసు చేస్తూ, కాళోజీ రాసిన లేఖ అందుకున్న ప్రధాని పి.వి. నరసింహారావుకు ఆలశ్యంగా గంట కొట్టిందట- కాళోజీకి పద్మభూషణ్ యివ్వాలని. ఎ.ఆర్. కృష్ణకు పద్మశ్రీ యిచ్చారు. మొత్తం మీద శ్రీశ్రీ వలె కాళోజీ కూడా ప్రభుత్వ లాంఛనాలకు మెత్తబడ్డారు.
నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడి, జైళ్ళ పాలైన కాళోజి, గేయాలు రాసి, ప్రజాకవిగా పేరొందారు. సాధారణ జీవితం గడుపుతూ గాంధేయుడి వలె నివశించారు.
కాళోజీతో పరిచయమైన తరువాత ఉభయులం కొన్ని సార్లు కలసి భోంచేశాం, ఔపోశనం పట్టాం. కాళోజీ నాన్ వెజి టేరియన్ తినేవాడు. ఇష్టం గా రం తాగేవాడు. తాపీగా భోజనం చేస్తూ బోలెడు కబుర్లు చెప్పేవాడు.
కాళోజి ఒక సారినాతో అన్నాడు. తప్పుడు ప్రదేశాల్లో గుచ్చినా సరే, అక్యు పంక్చర్ సూదులు, పనిచేస్తున్నాయట అని. నేను అశాస్త్రీయ చికిత్సలను విమర్శిస్తున్నట్లు తెలిసి, నన్ను సమర్థిస్తూ, వ్యంగ్యంగా అక్యుపంక్చర్ వైద్యులను దెప్పిపొడిచారు.
కాళోజి గేయాలు చదివాను. సింపుల్ గా సూటిగా వుంటాయి. నాగొడవ పేరిట రాసిన గేయాలు ప్రజాబాహుళ్యంలోకి వెళ్ళాయి. ఉద్యమాలలో పాల్గొన్న కాళోజి, గాంధి, నెహ్రూ, రాజాజీ ఎం.ఎన్. రాయ్ ను మెచ్చుకునేవారు. రాయ్ ను యూనివర్శల్ పర్సన్ అనేవారు.  కాళోజీ, 1969 లో ప్రత్యేక తెలంగాణాను సమర్ధించి, అలాగే నిలిచిపోయారు.
నక్సలైట్ ఎన్ కౌంటర్ల విషయంలో స్పందించిన కాళోజీ, పౌర హక్కుల సంఘ సమావేశాలలో పాల్లొన్నారు. అప్పుడు తరచు కలిసే వాళ్ళం.
1977లో సత్తుపల్లి (ఖమ్మం జిల్లా) నుండి స్వతంత్ర అభ్యర్థిగా నాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావుపై పోటీ చేశాడు కాళోజీ. డిపాజిట్ పోయింది. కాని ఆయనకు మహిళా సంఘాలు, అభ్యుదయ సంఘాలు మద్దత్తు యిచ్చాయి. ముఖ్యమంత్రిగా రాష్ట్రమంతటా పర్యటించాల్సిన వెంగళరావు, తన నియోజక వర్గానికి అతుక్కుపోయి, పోటీ తీవ్రంగా తీసుకోవడం గమనార్హం. అప్పుడు ఆంధ్రజ్యోతి దిన పత్రిక బ్యూరో ఛీఫ్ గా, నేను సత్తుపల్లి వెళ్ళి, కాళోజీని కలసి, మెచ్చుకున్నాను.
హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో కాళోజి జర్నలిస్టులతో కలిసి, మద్యం సేవిస్తూ కబుర్లు చెప్పేవారు. కొన్నాళ్ళు హైదరాబాద్ లోని హనుమాన్ టేకిడిలో నివసించారు. స్వాతంత్ర్య సమరయోధుడుగా ఫెన్షన్ రావడంతో, ఆయనకు ఆర్థికంగా వెసులు బాటు లభించింది. బాగా వృద్ధాప్యం వచ్చే వరకూ, కాళోజి జీవించారు. ఆయనతో కాలక్షేపం ఎప్పుడూ ఆహ్లాదంగానే వుండేది.
రచనలు : నాగొడవ (గేయాలు), లంకా పునరుద్ధరణ (కథలు).
అనువాదాలు : ఖలీల్ జీబ్రాన్, దిప్రాఫెట్, రెబెల్ ఇండియా.