మన మువ్వన్నెల పతాకం

India is best - MOBANGO - Free
mobile applications, games, themes, ringtones, wallpapers and videos
for your mobile phone

12, డిసెంబర్ 2010, ఆదివారం

"మాట్లాడే వెన్నెముక.....విశ్వనాథ సత్యనారాయణ (1895-1976)"


మాట్లాడే వెన్నెముక.....విశ్వనాథ సత్యనారాయణ (1895-1976)" మాట్లాడే వెన్నెముక-పాట పాడే సుషుమ్న;నిన్నటి నన్నయభట్టు-నేటి కవి సామ్రాట్టు;గోదావరి పలుకరింత-కృష్ణానది పులకరింత;కొండవీటి పొగమబ్బు-తెలుగువాళ్ళ గోల్డునిబ్బు "అని శ్రీశ్రీ ...విశ్వనాథగురించి అన్నారు ----తూర్పింటి నరేశ్ కుమార్

విశ్వనాథ సత్యనారాయణ (1895-1976)
చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి ....తన శిష్యుని గురించి ఇలా అన్నాడు.....
"నా మార్గమ్మును కాదు, వీని దరయన్ నా తాత ముత్తాతలం
దే మార్గమ్మును కాదు; మార్గమదియింకేదో యనంగా వలెన్
సామాన్యుండనరాదు వీని కవితా సమ్రాట్వ్త మా హేతువై,
యీ మచ్ఛిష్యుని దా వరించినది, నేనెంతే ముదంబందెదన్ ".
శ్రీశ్రీ విశ్వనాథగురించి ఇలా అన్నాడు......
"మాట్లాడే వెన్నెముక
పాట పాడే సుషుమ్న
నిన్నటి నన్నయభట్టు
నేటి కవి సామ్రాట్టు
గోదావరి పలుకరింత
కృష్ణానది పులకరింత
కొండవీటి పొగమబ్బు
తెలుగువాళ్ళ గోల్డునిబ్బు
అకారాది క్షకారాంతం
ఆసేతు మహికావంతం
అతగాడు తెలుగువాడి ఆస్తి
అనవరతం తెలుగువాడి ప్రకాస్తి
ఛందస్సు లేని ఈ ద్విపద
సత్యానికి నా ఉపద ".
తెలుగు సాహిత్యంలో ప్రాచీన సంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనం వీరి రచనలు.
సాహిత్యంలో గౌరీశంకర శిఖరం తో వీరిని పోలుస్తారు.
అటువంటి వీరి జీవిత విశేషాలను తెలుసుకోవడం సాహితీ విద్యార్థి గా మనవిధి.
వారి జీవితాంశాలను ఓ సారి పరికిద్దాం....
విశ్వనాథ సత్యనారాయణ 1895, సెప్టెంబరు 10న (మన్మథ నామ సంవత్సర భాద్రపద బహుళ షష్ఠి))
కృష్ణా జిల్లా నందమూరు గ్రామం (నేటి ఉంగుటూరు మండలం)లో జన్మించాడు.
తండ్రి శోభనాద్రి, తల్లి పార్వతమ్మ. ఈయన భార్య వరలక్ష్మమ్మ. 
విద్యాభ్యాసము నందమూరు, ఇందుపల్లిమరియు పెదపాడు గ్రామాల్లోను, పై చదువులుబందరు పట్టణంలోను సాగాయి. బందరు హైస్కూల్ లోచెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి తెలుగు ఉపాధ్యాయునిగా లభించడం ఆయన అదృష్టం.
బి.ఎ. తరువాత విశ్వనాథ సత్యనారాయణ బందరు హైస్కూల్ లోనే ఉపాధ్యాయునిగా చేరాడు.
ఉద్యోగం చేస్తూనే మద్రాసువిశ్వవిద్యాలయం నుంచి ఎమ్.ఎ. పట్టా సాధించాడు.
తరువాత మహాత్మా గాంధీ నడపుతున్న సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొనడం కోసం ఉద్యోగాన్ని వదులుకున్నాడు..
విశ్వనాథ సత్యనారాయణ కవి సమ్రాట్" బిరుదాంకితుడు. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.
20 వ శతాబ్దములోని ఆంధ్ర సాహిత్యమునకు, ప్రత్యేకించి సంప్రదాయ సాహిత్యమునకు పెద్ద దిక్కు.
ఆయన చేపట్టని సాహిత్య ప్రక్రియ లేదు.కావ్యములు, కవితలు, నవలలు, నాటకములు, ప్రయోగములు,
విమర్శలు, వ్యాసములు, కథలు, చరిత్రలు - ఆయన పాండిత్యము, ప్రతిభలు జగమెరిగినవి.
ఆయన మాటలలోనే చెప్పాలంటే.......
"నేను వ్రాసిన పద్యముల సంఖ్య , ప్రకటింప బడినవాని సంఖ్య, సుమారు ఇరువది వేలుండ వచ్చును. నేను
చింపివేసినవి ఏబది వేలుండవచ్చును " . ...అని అన్నాడు .ఆయన రాసిన రచనలన్నీ కలిపితే లక్షపుటలుండవచ్చును.
విశ్వనాథ గురించి జి.వి. సుబ్రహ్మణ్యం ఇలా చెప్పాడు -
"ఆధునికాంధ్ర జగత్తులో విశ్వనాధ ఒక విరాణ్మూర్తి.
వచన కవిత్వం వినా ఆయన చేపట్టని సాహితీ ప్రక్రియ లేదు. పట్టింది బంగారం చేయని పట్టూ లేదు.
గేయం వ్రాసినా, పద్యం రచించినా, ముక్తం వ్రాసినా, మహా కావ్యాన్ని రచించినా విశ్వనాధ కృతిలో
ఆయనదైన ఒక వ్యక్తిత్వం ప్రతిబింబిస్తుంది.వాక్కులో, వాక్యంలో, శబ్దంలో, సమాసంలో, భావంలో,
భావనంలో, దర్శనంలో, విమర్శనంలో, భాషణంలో, భూషణంలో ఒక వైలక్ష్యం వెల్లివిరుస్తుంది.
మహాకవి గా మనుగడ సాగించడానికి ఉండవలసిన మొదటి లక్షణం ఈ వ్యక్తిత్వం.
విన్నూత్న, విశిష్టమైన పాత్ర చిత్రణకు విశ్వనాధ పెట్టింది పేరు. ఆయా సందర్భాన్నిబట్టి, సన్నివేశాన్ని బట్టి
పాత్రల మనస్త్వత్తాన్ని విశ్లేషించుకుంటూ స్వయం వక్తిత్వంగల పాత్రలుగానూ, స్వయం ప్రకాశవంతమయిన
పాత్రలుగానూ, మహత్తరమయిన, రమణీయమయిన శిల్పాలుగాను తీర్చి దిద్దారు. అందునా వారి స్త్రీ పాత్ర చిత్రణ అద్భుతం!
ప్రముఖ బెంగాలీకవి రవీంద్రనాధ టాగూరు వలె తన రచయితలను కొన్నైనా ఆంగ్లంలోకి తర్జుమా చేసుకొంటే
ఆయన అంతర్జాతీయ ఖ్యాతినర్జించి ఉండేవాడని ఆయన అభిమానులు అంటుంటారు.
***అయితే విశ్వనాధ రచనలను విశ్లేషించే విమర్శకుడు ఆయన తాత్విక స్థాయిని అర్ధం చేసుకొంటే గాని సాధ్యపడదు అన్నది జగమెరిగిన సత్యం .
తన రచనలలో శ్రీమద్రామాయణ కల్పవృక్షం (జ్ఞానపీఠ అవార్డు లభించినది) తనకు వ్యక్తిగతంగా ఎంతో తృప్తినిచ్చిందని చెప్పాడు.
ఎందరో కవులు వ్రాసినా మళ్ళీ ఎందుకు వ్రాయాలంటే రోజూ తింటున్నామని అన్నం తినడం మానివేయడంలేదుగదా అన్నాడు.
* జ్ఞానపీఠ అవార్డు పొందిన తొలి తెలుగు రచయిత. 1971లో ఆయన "రామాయణ కల్పవృక్షము"నకు, జ్ఞానపీఠపురస్కారాన్ని అందించినపుడు, సన్మాన పత్రంలో ఇలా వ్రాయబడింది.********

********"As a Poet of classic vision and virility, as a novelist and play wright of deep insight and impact, as an essayist and literary critic of force and felicity, and as a stylist of rare "range" Mr. Satyanarayana has carved for himself a place of eminence amongst the immortals of Telugu Literature. His ceaseless creativity and versatility have kept him in the forefront of contemporary Telugu Literary Scene".**************************

*తమిళనాడులోని మధురై ప్రాంతం నేపధ్యంలో వచ్చిన నవల "ఏకవీర"ను పుట్టపర్తి నారాయణాచార్యులు
మళయాళంలోనికి,అంబటిపూటి హనుమయ్య తమిళంలోనికి అనువదించారు. ఏకవీర సినిమా కూడా వచ్చింది.
ఆ సినిమాకు సి.నారాయణరెడ్డి మాటలు, పాటలు సమకూర్చాడు.
*వేయిపడగలు నవలను మాజీ ప్రధాన మంత్రి పి.వి.నరసింహారావు "సహస్రఫణ్" పేరుతో హిందీ లోకి అనువదించాడు.
*భారతీయ సంస్కృతి, ఆచారం, విశేషాలు, మధ్య తరగతి జీవన విధానాలు ఈ నవలలో విశేషంగా చూపబడ్డాయి.
*కోకిలమ్మ పెళ్ళి, కిన్నెరసాని పాటలు (ఆనాటి) యువతరాన్ని ఆకట్టుకొనే వ్యావహారిక భాషలో వ్రాశాడు.
*విశ్వనాధ నవలలలో పురాణవైర గ్రంధమాల క్రింద వచ్చిన 12 నవలలు మహాభారతానంతర పూర్వయుగ
భారతదేశ చరిత్రను మరొకవిధంగా చూపుతాయి. అయితే వీటిలో ప్రతి నవలా ఉత్సుకతో నిండిన కధ,
అనితరమైన ఆయన శైలి, విశేషమైన పాత్రలతో పాఠకులను ఆకట్టుకొంటాయి.
విశ్వనాధ వ్యక్తిత్వం కూడా ప్రాచీన విధానాలకు, ఆచారాలకు కట్టుబడ్డది. భారతీయత మీద, తెలుగుదనంమీద అభిమానం కలిగింది.
తన అభిప్రాయాలను, ఇష్టాయిష్టాలను నిక్కచ్చిగా తెలిపేవాడు. ఇందువల్ల విశ్వనాధను వ్యతిరేకించినవారు చాలామంది ఉన్నారు.
ఛాందసుడు అనీ, "గతకాలమె మేలు వచ్చుకాలము కంటెన్" అనేవాడు అనీ (శ్రీశ్రీ విమర్శ) విమర్శించారు.
విశ్వనాధకు పాశ్చాత్య సాహిత్యం అంటే పడదని అనుకొంటారు. కాని ఆయన పాశ్చాత్య సాహిత్యం పట్ల గౌరవం కలిగి ఉండేవాడు.
షేక్స్‌పియర్, మిల్టన్, షెల్లీ వంటి కవుల రచనలను ఆసాంతం పరిశీలించాడు.
గురువులపట్ల ఎనలేని గౌరవం ఉన్న విశ్వనాధకు తన ప్రతిభ గురించ అపారమైన విశ్వాసం కూడా కలిగి ఉండేవాడు.
తనంతటివాడు (అనగా విశ్వనాధ సత్యనారాయణ అంతటివాడు) శిష్యుడయ్యాడని చెప్పుకొనే భాగ్యం నన్నయ తిక్కనాదులకు
లభించలేదని, చెళ్ళపిళ్ళవారికి దక్కిందని ఒకమారు తమ గురువుగారి సన్మాన సభలో అన్నాడు విశ్వనాధ.

"అలనన్నయకు లేదు తిక్కనకు లేదా భోగమస్మాదృశుం
డలఘు స్వాదు రసావతార ధిషణాహంకార సంభార దో
హల బ్రహ్మీమయమూర్తి శిష్యుడైనాడన్నట్టి దావ్యోమ పే
శల చాంద్రీ మృదుకీర్తి చెళ్ళపిళ వంశస్వామి కున్నట్లుగన్ ".
జాతీయ భావం తీవ్రంగా ఉండడానికి ఆరోగ్యకరంగా ఉండే ప్రాంతీయ భావం కూడా ఎంతో కొంత అవసరం అని విశ్వనాధ అనేవాడు.
శిల్పం గాని, సాహిత్యం గాని జాతీయమై ఉండాలి కాని విజాతీయమై ఉండరాదనేవాడు. సముద్రంపై పక్షి ఎంత ఎగిరినా రాత్రికి
గూటికెలా చేరుతుందో అలాగే మన జాతీయత, సంప్రదాయాలను కాపాడుకోవాలనుకొనేవాడు.
విశ్వనాధ వ్యక్తిత్వాన్ని చతుర్వేదుల లక్ష్మీనరసింహం ఇలా ప్రశంసించాడు: -
"ఆహారపుష్టి గల మనిషి. ఉప్పూ కారం, ప్రత్యేకంగా పాలు ఎక్కువ ఇష్టం. కాఫీలో గాని తాంబూలంలోగాని ఎక్కువగా పంచదార వాడేవారు.
ఆజానుబాహువు. బ్రహ్మతేజస్సు ముఖాన, సరస్వతీ సంపద వాక్కున, హృదయ స్థానాన లక్ష్మీకటాక్ష చిహ్నంగా బంగారుతో మలచిన తులసీమాల.
మనస్సు నవ్య నవనీతం. వాక్కు దారుణాఖఁడల శస్త్రతుల్యం. చదివేవి ఎక్కువ ఆంగ్ల గ్రంధాలు. వ్రాసేవి ఆంధ్ర సంస్కృత గ్రంధాలు.
చిన్నలలో చిన్న, పెద్దలలో పెద్దగా వదిగి పోయే స్వభావం. శారీరికంగా వ్యాయామం, యోగాభ్యాసం అయన నిత్యం అభ్యసించేవి.
విమర్శలూ, స్తోత్రాలూ, తిట్లూ, దీవెనలూ, దారిద్ర్యం, ఐశ్వర్యం - ఇలాంటి ద్వంద్వాలకు అతీతుడు. ఒకమాటలో ఆయన
అపూర్వమైన 'దినుసు' అని ప్రశంసించాడు.
అవార్డులు - రివార్డులు :
*ఆంధ్రజాతి తన సాంప్రదాయాలకు అనుగుణంగా ఆయనను "కవి సామ్రాట్" బిరుదుతో సత్కరించింది.
* 1964లో ఆంధ్రా యూనివర్సిటీ "కళాప్రపూర్ణ" తో సన్మానించింది.
* 1942 సంక్రాంతికి ఆయనకు గుడివాడలో "గజారోహణం" సన్మానం జరిగింది. 1956 లో షష్టి పూర్తి వేడుకలు కూడా గుడివాడలో ఘనంగా జరిగాయి.
* శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం డి.లిట్ పట్టాతో సన్మానించింది.
* "విశ్వనాథ మధ్యాక్కఱలు" రచనకు కేంద్రసాహిత్య అకాడెమీ వారి బహుమతి లభించింది.
* 1970లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆస్థాన కవిగా గౌరవించింది.
* 1970లో భారత ప్రభుత్వము పద్మభూషణ పురస్కారం తో గౌరవించింది.
నవలా సాహిత్యం :
* వేయిపడగలు
* స్వర్గానికి నిచ్చెనలు
* చెలియలికట్ట
* ఏకవీర
* తెఱచిరాజు
* మాబాబు
* జేబుదొంగలు
* వీరవల్లడు
* వల్లభమంత్రి
* విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు
* పులుల సత్యాగ్రహము
* దేవతల యుద్ధము
* పునర్జన్మ
* పరీక్ష
* నందిగ్రామరాజ్యం
* బాణావతి
* అంతరాత్మ
* గంగూలీ ప్రేమకధ
* ఆఱునదులు
* చందవోలు రాణి
* వేయి పడగలు
* శ్రీమద్రామాయణ కల్పవృక్షము
* కిన్నెరసాని పాటలు
* విశ్వనాధ మధ్యాక్కఱలు
* ప్రళయనాధుడు
* హాహాహూహూ
* మ్రోయు తుమ్మెద
* సముద్రపు దిబ్బ
* దమయంతీ స్వయంవరము
* నీల పెండ్లి
* శార్వరి నుండి శార్వరి దాక
* కుణాలుని శాపము
* ధర్మచక్రము
* కడిమిచెట్టు
* వీరపూజ
* స్నేహఫలము
* బద్దన్న సేనాని
* దిండు క్రింది పోకచెక్క
* చిట్లీచిట్లని గాజులు
* సౌదామిని
* లలితాపట్టణపు రాణి
* దంతపు దువ్వెన
* దూతమేఘము
* కవలలు
* యశోవతి

* పాతిపెట్టిన నాణెములు
* సంజీవకరణి
* మిహిరకులుడు
* భ్రమరవాసిని
* పురాణవైర గ్రంథమాల (పన్నెండు నవలలు)
o భగవంతునిమీది పగ
o నాస్తిక ధూమము
o ధూమమరేఖ
o నందో రాజా భవిష్యతి
o చంద్రగుప్తుని స్వప్నము
o అశ్వమేధము
o అమృతవల్లి
o పులిమ్రుగ్గు
o నాగసేనుడు
* హెలీనా
* వేదవతి
* నివేదిత
* నేపాళరాజ చరిత్ర (ఆరు నవలలు)
* కాశ్మీర రాజ చరిత్ర (ఆరు నవలలు

* శ్రీమద్రామాయణ కల్పవృక్షము
(6 కాండములు)
* ఆంధ్రప్రశస్తి
* ఆంధ్రపౌరుషము
* విశ్వనాథ మధ్యాక్కఱలు
* ఋతు సంహారము
* శ్రీకుమారాభ్యుదయము
* గిరికుమారుని ప్రేమగీతాలు
* గోపాలోదాహరణము
* గోపికాగీతలు
* భ్రమరగీతలు



* ఝాన్సీరాణి
* ప్రద్యుమ్నోదయము
* రురుచరిత్రము
* మాస్వామి
* వరలక్ష్మీ త్రిశతి
* దేవీ త్రిశతి (సంస్కృతం)
* విశ్వనాథ పంచశతి
* వేణీభంగము
* శశిదూతము
* శృంగారవీధి
* శ్రీకృష్ణ సంగీతము
* నా రాముడు
* శివార్పణము
* ధర్మపత్ని
* భ్రష్టయోగి (ఖండకావ్యము)
* కేదారగౌళ (ఖండకావ్యము)
* గోలోకవాసి
* దమయంతీస్వయంవరం
నాటకములు :
* అమృతశర్మిష్ఠమ్ (సంస్కృతం)
* గుప్తపాశుపతమ్ (సంస్కృతం)
* గుప్తపాశుపతము
* అంతా నాటకమే
* అనార్కలీ
* కావ్యవేద హరిశ్చంద్ర
* తల్లిలేని పిల్ల
* త్రిశూలము
* నర్తనశాల
* ప్రవాహం

* లోపల - బయట
* వేనరాజు
* అశోకవనము
* శివాజి - రోషనార
* ధన్యకైలాసము
* నాటికల సంపుటి (16 నాటికలు)

విమర్శలు :
* అల్లసానివారి అల్లిక జిగిబిగి
* ఒకనాడు నాచన సోమన్న
* కావ్య పరీమళము
* కావ్యానందము

* నన్నయగారి ప్రసన్న కథాకలితార్ధయుక్తి
* విశ్వనాధ సాహిత్యోపన్యాసములు
* శాకుంతలము యొక్క అభిజ్ఞానత
* సాహిత్య సురభి
* నీతిగీత
* సీతాయాశ్చరితమ్ మహత్
* కల్పవృక్ష రహస్యములు
* సాహితీ మీమాంస.
@@@@@@ ఇతరములు @@@@@@
* కిన్నెరసాని పాటలు
* కోకిలమ్మ పెండ్లి
* పాము పాట
* చిన్న కథలు
* ఆత్మ కథ
* విశ్వనాధ శారద (3 భాగాలు

* యతిగీతము
* What is Ramayana to me.

ఆంధ్ర పౌరుషము నుండి ఈపద్యం ను చదవండి

గోదావరీ పావనోదార వాపూర మఖిలభారతము మాదన్న నాడు
తుంగభద్రా సముత్తుంగ రావముతోడ కవులగానము శృతి గలయునాడు
పెన్నానదీ సముత్పన్న కైరవదళ శ్రేణిలో తెల్గు వాసించునాడు
కృష్ణా తరంగ నిర్ణిద్రగానముతోడ శిల్పము తొలి పూజ సేయునాడు
అక్షరజ్ఞానమెరుగదో యాంధ్రజాతి
విమల కృష్ణానదీ సైకతములయందు
కోకిలపుబాట పిచ్చుకగూండ్లు గట్టి
నేర్చుకొన్నది పూర్ణిమా నిశలయందు
రామాయణ కల్పవృక్షం నుండి.......
ఆకృతి రామచంద్ర విరహాకృతి
కన్బొమ తీరు రామ చాపాకృతి
కన్నులన్ ప్రభు క్రుపాకృతి
కైశిక మందు రామదేహాకృతి
సర్వ దేహమున యందు రాఘవ వంశ మౌళి ధర్మాకృతి
కూరుచున్న విధమంతయు రామచంద్ర ప్రతిజ్ఞ మూర్తియై.

విశ్వేశ్వర శతకము నుండి

మీ దాతృత్వమొ తండ్రి దాతృతయొ మీమీ మధ్య నున్నట్టి లా
వాదేవీలకు నాదు బాధ్యతకు సంబంధంబు లేదిట్లు రా!
ఏదో లెక్కలు తేల్చుకో! మొఱటుతోనేలా? యొడల్ మండెనా
ఏదో వచ్చిన కాడి కమ్మెదను సుమ్మీ నిన్ను విశ్వేశ్వరా!

కిన్నెరసాని పాటల నుండి

నడవగా నడవగా నాతి కిన్నెరసాని
తొడిమ యూడిన పూవు పడతిలా తోచింది
కడు సిగ్గు పడు రాచకన్నెలా తోచింది
బెడగు పోయిన రత్నపేటిలా తోచింది.

కోకిలమ్మ పేళ్ళి నుండి......
చిలుక తల్లి మహాన్వయంబున
నిలిచినవి సాంస్కృతిక వాక్కులు
కోకిలమ్మా తెలుగు పలుకూ
కూడబెట్టినదీ

మరొకటి......
వెస స్వరాజ్యము వచ్చిన పిదప కూడ
సాగి ఇంగ్లీషు చదువునే చదివినట్లు
అంగనామణి పెండిలియాడి కూడ
ప్రాతచుట్టరికమునె రాపాడుచుండె..................?????

5, డిసెంబర్ 2010, ఆదివారం

వినాయక చవితి పండుగ

వినాయక చవితి

దశరూపకాలు/దృశ్య కావ్యములు

దశరూపకాలు/దృశ్య కావ్యములు
స్టేజి పై ప్రదర్శించడానికి వీలయినవి.వీనికే రూపకములని పేరు.ఇవి 10 రకాలు.
1.నాటకము :
*ఇది ప్రఖ్యాత వస్తుకము ఉదా :రామయణం, భారతంలోని కథా వస్తువు.
*దీనిలో నాయకుడు ధీరోదాత్తుడు.5 -10 అంకాలు వస్తాయి.నాయక వధ జరగదు.
*నాయకుడు మరణించినా మళ్ళీ జీవించాలి.
*నాందీ ప్రస్తావనలతో మొదలై , భరత వాక్యంతో ముగింపు.
2.ప్రకరణము :
*ఇది కల్పిత వస్తువు.ఇందులో కథ లోక సంబందితమైనది.కవి కల్పితమై ఉండును.
*నాయకుడు ధీరశాంతుడు.అమాత్య, విప్ర , వణిజులలో ఎవరో ఒకరు నాయకుడు.
*10 అంకాలుంటాయి.నాటకానికి దీనికి భేదం ఎక్కువగా లేదు.
బాణము :
*ఇందులో కవి కల్పితమైన ధూర్తవృత్తం ఇతి వృత్తం.
*ఇందులో ఉక్తి - ప్రత్యుక్తులు ఆకాశ భాషితాలు.
4.ప్రహసనము :
*ఇది హాస్యరస ప్రధాన రూపకము.
*ఇది 3 విధాలు శుద్ధ , వికృత , సంకీర్ణ :
5.డిమము :
*ఇది ప్రఖ్యాత వస్తుకము .14 మంది ధీరోద్ధత నాయకులు ఉంటారు.
*దేవ, కిన్నెర , యక్ష , రాక్షస,భూత,ప్రేత , పిశాచాదులు.
*4 అంకాలుంటాయి.ఇందులో రౌద్రం అంగి రసము .
6. వ్యాయోగము :
*ఇది ప్రఖ్యాత వస్తుకము .ఏకాంకము .
*ధీరోద్ధతులు పలువురు ఇందులో నాయకులు.
*ప్రస్తావనాది నాట్య ధర్మములలో ఇది నాటకముతో సమానం.
7.సమావాకారము :
*దీనిలో 3 అంకాలుంటాయి. ప్రఖ్యాత వస్తువై ఉండాలి.
*దీనిలో వీరరసం అంగిరసం...మిగిలినవి అంగరసాలు..ఇందులో దేవదానవులు 12 గురు నాయకులుగా ఉంటారు.
అంకములలో కపట, ఉపద్రవాలు విడువదగినవి.
8 .వీథి :
*ఇది కల్పిత ఇతివృత్తము కలది .13 వీథి అంగములు దీనిలో ఉండాలి.
*1 - 2 పాత్రలుంటాయి. వీథి వలె అన్నింటికి మార్గం కావున దీనికాపేరు కలిగినది.
9. అంకము :
*దీనికి ఉత్సుష్టి అంకమని పేరు .
*దీనిలో వస్తువు ప్రఖ్యాతమో కవి కల్పితమో అయి ఉండాలి.
*దీనిలో ప్రధాన రసం కరుణము. నాయకులు ప్రాకృత మనుష్యులు.
*సంధులు ,వృత్తులు మొదలగు వాటిలో బాణముతో సమానము.
10.ఈహామృగము :
*ఇది మిశ్రమ వస్తుకము .దీనిలో 4 అంకములు ఉంటాయి.
*ధీరోద్దతులైన నర దివ్యులలో ఒకరు నాయకుడు...రెండవవాడు ప్రతి నాయకుడు.
*ప్రతి నాయకుడు చేతికి చిక్కినా అతనిని వధింపరాదు.
*దీనికి వ్యాయోగమునకు భేదము లేదు.
======= తూర్పింటి నరేశ్ కుమార్

11, నవంబర్ 2010, గురువారం

చిలకమర్తి లక్ష్మీనరసింహం (Chilakamarthi Lakshmi Narasimham) (1867 - 1946)

చిలకమర్తి లక్ష్మీనరసింహం (Chilakamarthi Lakshmi Narasimham) (1867 - 1946):
ప్రముఖ కవి, రచయిత, నాటక కర్త, పాత్రికేయుడు, సంఘ సంస్కరణవాది, విద్యావేత్త.
19వ శతాబ్దం చివర, 20 వశతాబ్దం ఆరంభ కాలంలో తెలుగు సాహిత్యం అభివృద్ధికి, తెలుగు నాట ఆధునిక భావాల
వికాసానికి పట్టుకొమ్మలైన మహామహులలో చిలకమర్తి ఒకడు.
ఇరవైరెండేళ్ళ వయస్సప్పుడు ఆయన రచించిన గయోపాఖ్యానం అనే నాటకం ప్రతులు లక్షకి పైబడి అమ్ముడుపోవటమనేది
తెలుగు సాహిత్య చరిత్రలో కనీ, వినీ, ఎరగని విషయం. ఈ నాటకంలో టంగుటూరి ప్రకాశం పంతులు అర్జునుడి వేషం వేసేడు.
జననం సెప్టెంబరు 26, 1867పశ్చిమ గోదావరి జిల్లా, పెరవలి మండలములోని ఖండవల్లి గ్రామములో
ఒక బ్రాహ్మణ కుటుంబములో వెంకయ్య, రత్నమ్మ దంపతులకు జన్మించాడు.
మరణం జూన్ 17, 1946
ఆయన ప్రాథమిక విద్య వీరవాసరం, నరసాపురం పట్టణాలలో సాగింది. 1889లో రాజమండ్రి హైస్కూలులో పట్టం చేత పట్టుకొన్నాడు.
1889లో రాజమండ్రి ఆర్య పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయునిగా చేరాడు. తరువాత ఇన్నీస్ పేట స్కూలులోనూ, మునిసిపల్ హైస్కూలులోనూ విద్యాబోధన సాగించాడు. తరువాత ఒక సంవత్సరం సరస్వతి పత్రిక సంపాదకునిగా పనిచేశాడు. ఆపై ఉద్యోగం విరమించి 1899లో హిందూ లోయర్ సెకండరీ స్కూల్ స్థాపించి 9 సంవత్సరాలు నడిపాడు. తరువాత ఈ పాఠశాల వీరేశలింగం హైస్కూల్ గా మార్చబడింది.

30వ ఏటనుండి రేచీకటి వ్యాధికి గురైనా ఆయన శ్రమించి తన కంటిచూపుకున్న అవరోధాన్ని అతిక్రమించి రచనలు కొనసాగించాడు.
ఆయన రచనలు 10 సంపుటాలుగా ప్రచురింపబడ్డాయి. 1943లో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆయనను కళాప్రపూర్ణ పురస్కారంతో సత్కరించింది.
1946, జూన్ 17[2] న లక్ష్మీనరసింహం మరణించాడు.పాఠశాలలో ఉన్నపుడే పద్యాలు వ్రాయడం ప్రారంభించిన లక్ష్మీ నరసింహం ఎన్నో రచనలు చేశాడు.
కీచక వధ ఆయన మొదటి నాటకం. తరువాత ద్రౌపదీ పరిణయం, గయోపాఖ్యానం, శ్రీరామ జననం, సీతా కళ్యాణం, పారిజాతాపహరణం వంటి నాటికలు రచించాడు. ఆయన వ్రాసిన నవలలో రామచంద్ర విజయం, హేమలత, అహల్యాబాయి, సుధా శరచ్చంద్రము ముఖ్యమైనవి. సరస్వతి పత్రిక సంపాదకునిగా ఉన్నపుడు సౌందర్య తిలక, పార్వతీ పరిణయం వ్రాశాడు. ఇంకా అనేక రచనలు చేశాడు.
1908లో ఒక ప్రెస్ స్థాపించాడు. 1916లో మనోరమ, పత్రిక అనే పత్రిక స్థాపించాడు.
దీని ద్వారా గణపతి, రాజరత్నము, రఘుకుల చరిత్ర (కాళిదాసు రచన రఘువంశానికి అనువాదం), సిద్ధార్థ చరిత్ర వంటివి ప్రచురించాడు.
లక్ష్మీ నరసింహం మొదటి తరం సంఘ సంస్కర్త. 1909లో సామాజికంగా వెనుకబడిన వర్గాలకోసం ఒక పాఠశాల ప్రారంభించి 13 సంవత్సరాలు నడిపాడు.
బ్రహ్మసమాజం, హితకారిణీ సమాజం వంటి సంస్కరణ దృక్పథం గల సంఘాల కార్యకలాపాలలో పాలు పంచుకొన్నాడు.
దేశమాత అనే వారపత్రిక ద్వారా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా వ్యాసాలు వ్రాశాడు.* ఆయన మొదటి నాటకం కీచక వధ 1889 జూన్ 15 రాత్రి ప్రదర్శింపబడింది.
* కలకత్తా బ్రహ్మసమాజం నాయకుడు పండిత శివానంద శాస్త్రి లోకల్ షేక్స్‌పియర్ అని లక్ష్మీనరసింహాన్ని ప్రశంసించాడు.
* అనేక మార్లు ప్రదర్శింపబడిన గయోపాఖ్యానం నాటకం ప్రతులు లక్షకు పైగా అమ్ముడు పోయాయి. ఇప్పటికీ ఇది రికార్డు (సరి చూడాలి)
* 1894లో ఆయన రాసిన రామచంద్రవిజయం అనే సాంఘిక నవల న్యాపతి సుబ్బారావు నిర్వహించిన పోటీలో మొదటి బహుమతి పొందింది. ఇది ఆయన ఆత్మకథ అంటారు.
* కొద్దికాలం ఆయన అష్టావధానాలు చేశాడు.
* 1897లో వ్రాసిన పృథ్వీరాజీయం అనే గేయ సంపుటి వ్రాతప్రతి ప్రమాదవశాత్తు చిరిగి పోయింది కనుక ప్రచురణకు నోచుకోలేదు.
* మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుండి రాకముందే చిలకమర్తి హరిజనులకోసం ఒక పాఠశాలను ఆరంభించాడు.
* చిలకమర్తి గ్రహణ, ధారణ శక్తులు అమోఘం. వాసురాయకవి ఆయనది "ఫొటోజెనిక్ మెమరీ" అని వర్ణించాడు.
* ఆయన మంచి వక్త. శ్రోతలను బాగా ఆకట్టుకొనేవాడు.
* భారత జాతీయ కాంగ్రెసు కార్య కలాపాలలో ఆయన చురుకుగా పాల్గొనేవాడు.
* ఆయన రచన గణపతి నవల హాస్యరచనలలో ఎన్నదగినది.
నాటకాలు
1. కీచక వధ -1889
2. ద్రౌపదీ పరిణయం -1889-1890
3. శ్రీరామ జననం -1889-1890
4. పారిజాతాపహరణం -1889-1890
5. సీతా కళ్యాణం -1889-1890
6. గయోపాఖ్యానం -1889-1890
7. నల చరిత్రం -1892
8. ప్రసన్నయాదవం - 1906 (ప్రదర్శింప బడింది, కాని ప్రచురింపబడలేదు)
9. నవనాటకము
నవలలు

1. రామచంద్ర విజయము - 1894 (ధారావాహిక)
2. హేమలత -1896 (చారిత్రిక నవల)
3. అహల్యాబాయి - 1897
4. సౌందర్య తిలక - 1898 - 1900
5. పార్వతీపరిణయము
6. గణపతి

కవితలు

1. పృథ్వీరాజీయము (అముద్రితం)

అనువాదాలు

1. పారిజాతాపహరణము (సంస్కృత నాటకం నుండి)
2. అభిషేక నాటకం (భాసుని సంస్కృత నాటకం నుండి)
3. స్వప్న వాసవదత్త (భాసుని సంస్కృత నాటకం నుండి)
4. మధ్యమ వ్యాయోగము (భాసునిసంస్కృత నాటకం నుండి)
5. ఋగ్వేదం (ఒక మండలం)
6. ధర్మ విజయం (పి. ఆనందాచార్యులు మహాభారత కథ ఆధారంగా అంగ్లంలో రచించిన నవల)
7. సుధా శరచ్చంద్రము - (బంకించంద్ర ఛటర్జీ ఆంగ్ల నవల "LAKE OF PALMS")
8. వాల్మీకి రామాయణం (కృష్ణమూర్తి అయ్యర్ రచన)
9. రఘుకుల చరిత్ర (కాళిదాసుని రఘువంశం నుంచి)

ఇతర రచనలు

1. రాజస్థాన కథావళి
2. మహాపురుషుల జీవిత చరిత్రలు
3. కృపాంబోనిధి
4. చిత్రకథాగుచ్ఛ
5. సమర్థ రామదాసు
6. భల్లాట శతకం
7. స్వీయ చరిత్ర
8. ప్రకాశములు (4 సంపుటములు)
9. భాగవత కథా మంజరి
10. రామకృష్ణ పరమహంస చరిత్ర
11. కాళిదాస చరిత్ర
12. చంద్రహాసుడు
13. సిద్ధార్థ చరిత్ర

10, నవంబర్ 2010, బుధవారం

ఆదర్శ గురు శిష్యులు శుక్రాచార్య -కచులు :

ఆదర్శ గురు శిష్యులు శుక్రాచార్య -కచులు :
గురుశిష్యుల బంధానికి ఈ కథ ఓ మంచి ఉదాహరణ ......ఇది క్షీరసాగర మథనమునకు పూర్వం జరిగిన కథ.
దేవదానవులకు అమృతకలశం అప్పటికింకా లభించలేదు.....
దేవదానవ యుద్ధాలు అతి భీకరముగా జరిగేవి. ఇరుపక్షాలలో ఎందఱో సైనికులు అసువులు బాసేవారు.
ఇలావుండగా రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు తీవ్ర తపస్సుచేసి "మృతసంజీవనీ విద్య"ను సంపాదించాడు.
ఇంకేమున్నది? యుద్ధములలో చచ్చిన రాక్షసులను సంజీవనీ విద్య ద్వారా బ్రతికించేవాడు శుక్రుడు.
వాళ్ళు మళ్ళీ దేవతలపై పడి పోరుసాగించేవారు. దేవతలు ఎంత బలవంతులైనా ఇలా జరిగేసరికి వారి శక్తి క్షీణించసాగినది.
మంచికి అపజయం కలుగుట చూడలేని దేవతాగురువు బృహస్పతుల వారు తన కుమారుడైన కచుని పిలిచి శుక్రుని శిష్యుడవై మృతసంజీవని అభ్యసించిరమ్మని ఆదేశించాడు.
పాపభీతి లేని రాక్షసులతో వ్యవహారము తన కుమారుని ప్రాణాలకే అపాయమని తెలిసికూడా ధర్మస్థాపనార్థం తన కుమారుని ఆ అసాధ్యకార్యము నిర్వర్తించుకొని రమ్మని పంపినాడు బృహస్పతి.
పిత్రాజ్ఞాపాలకుడైన కచుడు వెంటనే బయలుదేరి శుక్రాచార్యుని వద్దకు వెళ్ళి సాష్టాంగ ప్రణామము చేసి “గురుభ్యోనమః స్వామీ!!!!!
నేను ఆంగీరస గోత్రజాతుడను.... దేవగురువులైన బృహస్పతులవారి తయుడను.....నా నామధేయం కచుడు ....
విద్యార్థినై మీ వద్దకు వచ్చాను” అని ప్రార్థించాడు.
కచుని వినయానికి సంతోషించిన శుక్రుడు ...నాయనా! వినయవిధేయతలే విద్యార్జనకు ప్రథమ సోపానాలు. నీవంటి అర్హుడిని శిష్యుగా స్వీకరించుట నాకు ఆనందదాయకము
అని ఆశీర్వదించి తన శిష్యబృందములో చేర్చుకొన్నాడు.

కచుడు రోజూ సూర్యోదయాత్పూర్వమే లేచి కాలకృత్యాలు తీర్చుకుని సలిలోదకాలతో స్నానాది క్రియలు నిర్వహించి సంధ్యావందనాది ఆహ్నికాలు యథావిధిగా చేసేవాడు.
తీవ్రమైన బ్రహ్మచర్య నిష్ఠను అవలంభిస్తూ ఎంతో ప్రీతితో గురుశుశ్రూష చేసేవాడు. భక్తి ఏకాగ్రతలతో వేదశాస్త్రాలు అభ్యసించేవాడు.

శుక్రాచార్యునికి యవ్వని త్రిలోకసౌందర్యవతి దేవయాని అను పేరుగల కుమార్తె ఉండేది. కచుడు గురుపుత్రి అయిన దేవయానిని సోదరిగా భావించేవాడు.
కచుని వినయం సంస్కారం విద్యలపైనున్న కుతూహలం అతనిని శుక్రునికి ఎంతో ప్రియునిగా చేసినాయి.
కచుని మంచితనం చూచి అసూయతో మిగతా రాక్షస శిష్యులందఱూ సమావేశమై ఇలా అనుకొన్నారు “వీడు మన శత్రువుల పక్షము. వీడికి మృతసంజీవనీ విద్య లభిస్తే అది మనకు అపాయకరము.
కనుక వీడిని చంపి పారేద్దాము”. శుక్రుని గోవులను కాచి అడవినుంచి ఇంటికి తిరిగివస్తున్న కచుని నిర్దాక్షిణ్యంగా చంపేశారు ఆ రక్కసులు.
కచుడు రావటం ఆలస్యమైనదని చింతించి దేవయాని తండ్రితో “నాన్నా! ఎంత అవసరం వచ్చినా కనీసం సాయంకాల సంధ్యావందన సమయానికైనా ఆశ్రమానికి తిరిగి వచ్చేవాడు కచుడు.
కానీ ఇవాళ ఇంత ప్రొద్దెక్కినా ఇంత వరకూ రాలేదు. దయచేసి మీ దివ్యదృష్టితో కచుని జాడ తెలుసుకోండి” అని ప్రార్థించింది.
శుక్రుడు దివ్యదృష్టితో జరిగినది తెలుసుకున్నాడు. వెంటనే తన మృతసంజీవనీ విద్యతో కచుని బ్రతికించాడు.

ఈర్ష్యాగ్నిచే జ్వలించబడుతున్న రాక్షసులకు ఈ విషయము తెలిసినది. మరునాడు మళ్ళీ కచుని సంహరించి దేహాన్ని కాల్చి బూడిద చేసి దాన్నిసురాపానంలో
కలిపి వినయంగా శుక్రిని ఇచ్చారు. శుక్రుడు ఆ సురాపానంను పానముచేశాడు. కచుడు ఎంతకీ రాకపోయేసరికి దేవయాని మళ్ళీ తండ్రితో మొరపెట్టుకున్నది.
శుక్రుడు దివ్యదృష్టితో జరిగినది తెలుసుకుని ఎంతో బాధ పడి “ఈ రాక్షసులు చాలా కిరాతకులు. తెలియకుండా నేనెంత తప్పుచేసాను! ఈ సురాపానం చాలా ఘోరమైనది.
దీని మత్తు ప్రభావము వలన నా వివేచన నశించినది” అనుకొని ఇకపై ఎవరిచే ఇట్టి తప్పులు జరుగరాదని ఈ విధముగా కట్టడి చేసినాడు:

“ఎంత కొంచమైననూ సురాపానం చేయరాదు. అది మహాపాపము”. ఇలా ధర్మనియమం తెలియజెప్పి మళ్ళీ ఇలా అన్నాడు
“కానీ తెలిసిచేసినా తెలియక చేసినా తప్పు తప్పే కదా! నేను చేసిన తప్పును సరిదిద్దుకొనెదను. మృతసంజీవనీ విద్యను నా కడుపులో సూక్ష్మ రూపములో ఉన్న కచునకు ఉపదేశించెదను.
ఆపై అతనిని బ్రతికించెదను. కచుడు నా ఉదరము చీల్చుకువచ్చి మృతుడనైన నన్ను బ్రతికించెదడు”. శుక్రుడు అలాగే చేశాడు.
కచుడు శుక్రగర్భం నుంచి బయటకు వస్తూనే గురువు గారిని బ్రతికించినాడు. ప్రణామము చేసి శుక్రుని వద్ద సెలవు తీసుకొని ఇంటికి బయలుదేరినాడు.
అప్పుడు దేవయాని తన ప్రేమను వ్యక్త పఱచి తనను వివాహమాడమని నిర్బంధించింది. అంతట కచుడు “సోదరీ! నీవు నా గురు పుత్రికవు. కావున నాకు చెల్లెలివి అవుతావు.
నీకిట్టి అధర్మ కోరిక కలుగరాదు” అని హితవు చెప్పాడు. నిరాకరించిన కచునిపై క్రోధిత అయి దేవయాని కచుని ఇలా శపించినది
“నన్ను హింసించిన ఫలముగా ఈ విద్య నీకు ఉపకరించదు పో”!అన్నాడు...మరి నన్ను అకారణంగా శపించినందుకు.....ఇదే నా ప్రతిశాపం....."నువ్వు విలోమ వివాహంద్వారా క్ష్యత్రియున్ని వివాహ మాడుతావని ప్రతి శాపమిచ్చాడు ".తర్వాతి కాలంలో దేవయాని యయాతి చక్రవర్తిని వివాహమాడుతుంది. ఈ కథలో మనకుతన శత్రువు దేవతల వంశం వాడైన కచునికి తన కష్టార్జితమైన మృతసంజీవనీ విద్యను శుక్రాచార్యుడు ఎటువంటి శంక లేకుండా కచునికి నేర్పడం.....కచుడు తన గురువు ఐన శుక్రాచార్యుడిని భక్తిశ్రద్దలతో కొలవడం....అవకాశం వచ్చినప్పటికిని అద్వితీయ సౌందర్య రాశి ఐన దేవయానిని వివాహమాడకపోవడం నిజంగా ,,,,,చాలా గొప్ప అంశాలు....భారతంలో కన్పిస్తాయి...ఆధునిక విద్యార్థినీ విద్యార్థులు ఈ కథను చూసి నేర్చుకోవాలి
.ఇలాంటి అంశాలు దారితప్పి భ్రష్టులౌతున్న నేటి యువత ....వీటిని చూసైన నేర్చుకోవాలి....కొంతైన సమాజం మారాలి......మార్పు తీసుకురావాలని ఆశిద్దాం

14, మార్చి 2010, ఆదివారం

అష్టా దశ పురాణములు

భారత దేశం అనగా వేదాలకు , పురాణాలకు పుట్టినిల్లు .
మన దేశం లో 18 పురాణాలు , 18 ఉప పురాణాలు ....108 ఉపనిషత్తులు ...వెలిశాయి.

మనము పురాణములు 18 అని చెప్పుతుంటాం.
అవియే అష్టాదశ పురాణములు . ఐతే ఈ పద్ధెనిమిది పురాణాలు.

శ్లోకము:-
మద్వయం, భద్వయంచైవ
భ్ర త్రయం వ చతుష్టయం.
అ .నా . పద్ . లిం . గ . కూ . స్కా . ని
పురాణ్యష్టాదశా స్మృతా !

తేటగీతి:-
మద్వయము భద్వయము మన మదిని గాంచ.
భ్ర త్రయము వ చతుష్టయం పరగు నరయ
గా, అ . నా . పద్మ . లిం . గ . కూ . స్కా . లనంగ
పద్ధెనిమిది పురాణముల్ పరగుచుండె.

తేటగీతి:-
మ . మ . భ . భ . భ్ర . భ్ర . భ్ర . వ . వ . వ . వ . మరల చూడ
గా, అ . నా . పద్మ . లిం . గ . కూ . స్కా . లనంగ
పద్ధెనిమిదిపురాణముల్ పరగు చుండె.

గమనిద్దామా!
మద్వయము = రెండు మాలు
1. మత్స్య పురాణము,
2. మార్కండేయ పురాణము.

భ ద్వయము = రెండు భాలు
1. భాగవత పురాణము.
2. భవిష్యత్ పురాణము.

భ్ర త్రయం = మూడు భ్
1. బ్రహ్మాండ పురాణము.
2. బ్రాహ్మ పురాణము.
3. బ్రహ్మ వైవర్త పురాణము.

వ చతుష్టయము = నాలుగు వాలు.
1. వామన పురాణము.
2. వాయవ్య పురాణము.
3. వైష్ణవ పురాణము.
4. వారాహ పురాణము.

అ = అ. > అగ్ని పురాణము.
నా = నా > నారద పురాణము.
ప > పద్మ పురాణము.
లిం > లింగ పురాణము.
గ = గ > గరుడ పురాణము.
కూ = కూ > కూర్మ పురాణము.
స్కా = స్కా > స్కాంద పురాణము.

13, మార్చి 2010, శనివారం

ఆంధ్రమహాభారతానువాదం :

ఆంధ్రమహాభారతానువాదం :

వ్యాసభారతాన్ని తెలుగులోకి తెచ్చిన ఆదికవి నన్నయ్య యథామూలానువాదం చెయ్యలేదు. శ్లోకానికి పద్యము అన్న పద్ధతి పెట్టుకోలేదు. భారత బద్ధ నిరూపితార్థము తెలుగు వారికి అందించడమే నా లక్ష్యం అన్నాడు. దానికి తగినట్టు పద్దెమినిమిది పర్వాలకూ ప్రణాళిక రచించి తన స్వేచ్ఛానువాదాన్ని ప్రారంభించాడు. తిక్కన, ఎర్రనలు అదే మార్గంలో అదే లక్ష్యంతో దాన్ని పూర్తి చేసారు. అప్పటినుంచి ప్రాచీన తెలుగు కవులు అందరికీ అదే ఒరవడి అయ్యింది. స్వేచ్ఛానువాదాలే తప్ప యథామూలానువాదాలు అవతరించలేదు (శాస్త్ర గ్రంథాలు మాత్రం దీనికి మినహాయింపు). వర్ణనల్లోనే రసవద్ఘట్టాలలోనేఈ తరహా స్వేచ్ఛను తీసుకున్నా సన్నివేశాలే ఆయా రచనల్లో కాంతిమంతాలుగా భాసించాయి .

. సంస్కృత మహాభారతం నూరు పర్వాల గ్రంధమనీ, లక్ష శ్లోకాల విస్తృతి కలిగి ఉందనీ ప్రసిద్ధి. ఆది పర్వంలో నన్నయ చెప్పిన పర్వానుక్రమణిక కూడా ఈ విషయానికి దగ్గరగానే ఉంది. ముఖ్య పర్వాలు, ఉపపర్వాలు కలిపి నూరు ఉన్నాయి. అందులో హరివంశ పర్వం భవిష్య పర్వంలో కలిసి ఉన్నది. నన్నయ తన పర్వానుక్రమణికలో హరివంశాన్ని చేర్చలేదు. తన అష్టాదశ పర్వ విభక్తంలో నూరు పర్వాలను అమర్చాడు. ఉపపర్వ విభాగాన్ని తెలుగులో పాటించలేదు. తిక్కనాదులు నన్నయ నిర్ణయాన్ని అనుసరించారు. ఎఱ్ఱన హరివంశాన్ని వేరే గ్రంధంగా రచించాడు. ఈ విధంగా నూరు ఉపపర్వాల సంస్కృత మహాభారతం తెలుగులో పదునెనిమిది పర్వాల ఆంధ్ర మహాభారతంగా రూపు దిద్దుకొంది. తెలుగులో ఆశ్వాసాలుగా విభజించారు.

పదకొండవ శతాబ్దానికి ముందే వ్యాసభారతం కన్నడంలోకి వెలువడింది . అయితే అది కన్నడ భారతమే తప్ప వ్యాస భారతం కాదు. వ్యాసుడి లక్ష్యమూ, పరమార్థమూ పూర్తిగా భంగపడ్డాయి. కథాగమనమూ, పాత్రల పేర్లు మాత్రం మిగిలాయి. స్వభావాలు మారిపోయాయి. భారత రచనకు పరమార్థమైన వైదిక ధర్మం స్థానాన్ని జైన మతం ఆక్రమించింది. ఈ అన్యాయాన్ని చక్కదిద్దడం కోసం నన్నయ గళమెత్తి కలం అందుకున్నాడు . అందుచేత భారత పరమార్థాన్ని పునఃప్రతిష్ఠించడమే సత్వర కర్తవ్యంగా స్వేచ్ఛానువాద పద్ధతిని స్వీకరించాడు. బహుశ ఇందులోని స్వేచ్ఛ అనంతర కవులను ఆకర్షించింది. స్వీయ ప్రతిభా ప్రదర్శనకు అవకాశం ఇచ్చింది. అందుచేత కథాకల్పనల కోసం వృధా శ్రమ పడకండా ప్రఖ్యాత వస్తులేశాన్ని స్వీకరించి సర్వాత్మనా స్వతంత్ర కావ్యాలను రచించారు. హృద్యంగా, అపూర్వంగా, అఘనిబర్హణం చేసేదిగా వుంటూ, వింటే సమగ్రమైన జ్ఞానాన్ని ఇచ్చేదే మహాకావ్యం అని నన్నయ నిర్వచించాడు. ధర్మ తత్వజ్ఞులు ధర్మ శాస్త్రంబని..యధ్యాత్మ వేదులు నీతి శాస్త్రంబని....పద్యంలో .... భారతం ఒక విజ్ఞాన సర్వసం కనుకనే ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్తము అంటారు. అధ్యాత్మ విధులు వేదాంతమంటారు. నీతి విచక్షణులు నీతి శాస్త్రమనీ, కవి వృషభులు మహా కావ్యమనీ, లాక్షిణికులు సర్వలక్ష సంగ్రహమనీ, ఇతిహాసకులు ఇతిహాసమనీ, పరమ పౌరాణికుల పురాణ సముచ్ఛయమనీ కొనియాడతారు. భారతం విశ్వ జనీనం.
భారతాంధ్రీకరణలో నన్నయ మూడు లక్షణములు తన కవితలో ప్రత్యేకముగా చెప్పుకొన్నారు -
(1) ప్రసన్నమైన కథాకలితార్థయుక్తి
(2) అక్షర రమ్యత
(3) నానా రుచిరార్ధ సూక్తి నిధిత్వము.
కలితార్థయుక్తి అంటే కథతో కూడుకొని ఒక మహర్దము ప్రవేశించడం. ఇది ఒక మహాశిల్పం. ఇది నన్నయ్య ఉపజ్ఞ.
భారతంలో నన్నయ సంస్కృత శబ్దములను కొన్నిచోట్ల ¸°గికార్థంలో వాడి కధార్థ యుక్తి కలిగించాడు. ఆంధ్రభాషకు నన్నయ పెట్టిన భిక్ష అక్షయం. మిగిలిన కవులందరూ ఆయన నుండి భాషా శబ్దాలు, పద్య రచనలోని ఒడుపులు గ్రహించారు కాని ఎవరికీ ఆయన ప్రసన్నకధా కలితార్థ యుక్తి మాత్రం అబ్బలేదు.

జనకుడు :

జనకుడు :
ఇతను హ్రస్వరోముని కుమారుడు.మిథిలా నగర ప్రభువు .ఇతని సోదరుడు కుశధ్వజుడు.జనకుని భార్య పేరు రత్నమాల సంతానార్థియై ఇతడు పుత్రకామేష్టి యాగాన్ని చేయటకై భూమిని దున్నిస్తున్నప్పుడు..నాగేటి చాలులో ఒక బంగారపు పెట్టెలో ...ఓ ముద్దులొలికె చిన్నారి దొరికింది.నాగేటి చాలులో దొరికినందున ఆ అమ్మాయికి సీత ' యని పేరు పెట్టారు.
జనక మహారాజు ప్రకటించిన సీతాస్వయంవరంలో శ్రీరామచంద్రుడు శివ చాపాన్ని విరిచి సీతమ్మను చేపట్టాడు. జనకుడు తన తమ్ముని కూతుర్లను రాముని తమ్ములకు ఇచ్చి వివాహం చేశాడు. జనకుడు జ్ఞాన సంపన్నుడు .గృహాస్థాశ్రమంలో నుండి స్వర్గంను పొందిన పుణ్యశాలి. ఓ రోజు యాజ్ఞవల్క్యునికి ఇతను అగ్నిహోత్రం గూర్చి చెప్పగా...అతడు సంతసించి గుణగణాలను కీర్తించి బ్రాహణత్వంను పొందుమని వరమిచ్చాడు.

జంబూ ద్వీపము :

జంబూ ద్వీపము :
మేరు పర్వతానికి దక్షిణాన గల ద్వీపమే జంబూ ద్వీపము .ఈ ద్వీపంలో గల జంబూవృక్షమును బట్టి ఈ పేరు వచ్చింది. ఈ వృక్షానికే సుదర్శనమని పేరు. దీని పొడవు 2 ,700 ల యోజనాలు .జంబూవృక్షం నుండి రాలిన పండ్ల రసం వలన ఓ నది ప్రవహించెను. అదియే జంబూనది.ఈ నదిలో నీరు త్రాగిన వారికి ఆకలి ,దప్పులు ఉండవు. ముదుసలితనం రాదు.. ఎటువంటి వ్యాధులు ధరిచేరవు....నిత్యయౌవ్వనులై శోభిల్లుతారు.
ఈద్వీపంలో 9 ఖండాలు కలవు .వీటికే వర్షములు అని పేరు. అవి వరుసగా.....1.కురువు 2. హిరణ్మయము 3.రమణకము 4.ఇలావృత్తము 5.భద్రాశ్వము 6.కేతుమాలము 7.హరివర్షము 8.భారత వర్షము 9.కింపురుషం
ఇప్పటికి మన ఇళ్ళల్లో శుభకార్యాలు చేస్తున్నప్పుడు .....భరతఖండే ...జంబూద్వీపే ....అని అనడం పరిపాటి.ఈ విధంగా జంబూద్వీపాన్ని గుర్తు చేసుకుంటాము .

నృసింహావతారము పరిచయం: వివరణ

నృసింహావతారము పరిచయం: వివరణ
శ్రీ మహావిష్ణువు దుష్టశిక్షణ, శిష్టరక్షణకై మరియు లోక కళ్యాణార్థమై
దశావతారములు ఎత్తాడు.

వాటిలో నృసింహావతారము నాల్గవది.
సంస్కృత సాహిత్యంలో అవతార గాథ కథాథ్మకంగా స్తోత్ర రత్నంగా వుంది.

తెలుగులో ఎఱ్ఱాప్రగడ మొదలైన వారు కావ్యాలు వ్రాశారు.
మహబూబ్ నగర్ జిల్లాలో దాదాపు 40 వరకు నృసింహా లయాలు వున్నాయి.
వాటిలో ముఖ్యమైనవి 22 అచ్చంపేట మండలంలో ....

కల్వకుర్తి మండలంలో .....వనపర్తి మండలంలో.....
నాగర్ కర్నూల్ మండలంలో
అధికంగా ...కొల్లాపూర్ ...మక్తల్.... అలంపూర్
జడ్చర్ల మండలాల్లో ...ఒక్కోక్క నృసింహా లయాలు వున్నాయి

మహబూబ్ నగర్ మండలం కోయిలకొండలోని
నృసింహ స్వామి ఉగ్రావతారుడు.వనపర్తి మండలంలోని అంకూర్లో ,కొల్లపూర్ మండలంలోని

సింగపట్నంలో, మక్తల్ మండలంలోని ,మంగనూర్లో లక్ష్మినృసింహా ఆలయాలు వున్నాయి.
సింగపట్ట్టణం(సింగోటం) లక్ష్మినృసింహా స్వామి జాతర :
పరిచయం కొల్లపూర్ మండల కేంద్రానికి 9 కి .మీ. దూరంలో
సింగోటం(సింగపట్ట్టణం) గ్రామంలో శ్రీలక్ష్మినృసింహాస్వామి
లింగరూపంలో వెలియడాన్ని విశేషంగా చెపుతారు.
శివకేశవులకు ఆభేదం లేకుండా స్వామివారు ...

త్రిపూండ్రాలు ...ఊర్ధ్వపూండ్రాలు
కలిగి స్వయంభూఃగా ఈ ప్రాంతంలో వెలిశారు.
తదనంతర కాలంలో స్వామి ఆలయ పాదానికి కుడివైపున శివాలయ ప్రతిష్ట,
రత్నగిరికొండపై రత్నలక్ష్మీ
అమ్మవారి ప్రతిష్టను చేశారు .

శ్రీలక్ష్మినృసింహాస్వామి గోవిందా....గోవిందా..... అంటూ మిన్ను ముట్టే భక్తుల గొంతుకలతొ
సిగమెత్తే శివసత్తుల కోలాహాలంతో వేలాది భక్తుల భక్తి,పారవశ్యంతో కోలాటంవేసే భక్త మండలి ఉత్సహనందాలతో మకర సంక్రాంతి మొదలుకొని .....నెలరోజుల పాటు
ఉత్సవాలు చూపరులకు నయనాందాన్నికలుగజేస్తాయి . ప్రతీ సంవత్సరము జరిగే ఈ

జాతరకు మహబూబ్ నగర్ జిల్లాయే గాక ఇరుగు పొరుగు జిల్లావాసులతో పాటు
కర్ణాటక ,రాజస్థాన్
రాష్ట్రాల నుండి భక్తులు వచ్చి తమ మొక్కులను తీర్చుకోని తరిస్తారు.

దేవాలయ స్థల ఐతిహ్యం
జిల్లాలోని ప్రాచినమైన ప్రసిద్దినోందిన దేవాలయల్లొ

సింగపట్ట్టణం(సింగోటం) లక్ష్మినృసింహా స్వామి దేవాలయం ఒక్కటి రత్నగిరి కొండకు ఆభిముఖంగా స్వామివారు ఈ ప్రాంతంలో కొలువుదీరటానికి ముందు ఆసక్తికరమైన 600 సంవత్సరాల చారిత్రక గాథఒకటి వుంది
సురభి వంశానికి చెందిన 11వ తరంవాడైన సింగమనాయుడు 
అను భూపాలుడు జటప్రోలు ప్రాంతాన్ని కేంద్రంగా పరిపాలిస్తున్న రోజులవి.
ఆ జిల్లాలో సింగపట్టణం గ్రామానికి చెందిన ఒక యాదవుడు 
ప్రతిదినం తెల్లవారు ఝామున గోర్కోలు చూసూకుంటూ తన పొలము లో అరక దున్నుతుంటాడు.
అపుడు లింగరూపంలో ఉన్న ఒక నల్లని సరుపరాయి నాగలికి అడ్డు తగలుతూ అతని పనికి అంతరాయం కలిగించేదట. రైతు ఆ శిలను ఎన్ని సార్లు ప్రక్కకు చేర్చినా అదే స్థలానికి చేరుతుండటంతో అతనికి ఏం చేయాలో పాలుపోలేదు.ఆ శిల మహిమను ఆతడు గుర్తించలేకపోయాడు. ఆవిధంగా కోన్ని రోజులు గడిచాయి.........

ఆ యాదవుడు తాను పేదవాడినని, తన పనికి అంతరాయం కలుగకుండా కరుణించమని ఆ శ్రీమన్నారాయణుని ప్రార్ధించాడు. భక్థుని మొర నిన్న శిలారూపంలోని స్వామి ఆ రాత్రి నేరుగా భూపాలుడైన ' సింగమనాయునికి ' స్వప్నరూపంలో సాక్షాత్కరిస్తాడు. ' 
తాను ఉత్తర దిశలో రెండు ఆమడల దూరంలో గల 
ఒక రైతు పొలంలో లింగరూపంలో వెలిశానని, రోజూ నాగలికి అడ్డుపడుతూ ఉన్నా రైతు తనను గుర్తించడం లేదని, ఇదే దినం తనను గుర్తించి వెంటనే ప్రతిష్ఠించి పూజలు జరుపమని " శాసించడంతో సింగమనాయుడు నిద్రనుండి ఉలిక్కిపడి లేచి తాను కలలో విన్నది, కన్నది ఇంతవరకు నిజమౌ! అనుకొని సైన్యంతో లింగ రూపంలో వున్న 
ఒక శిల కాంతివంతంగా వెలుగుతూ కనిపించింది. 
కలలో స్వామిని, ప్రజలు తోడురాగా ప్రస్తుతం వున్న ఆలయం వెనక
ఎత్తైన బండ ప్రాంతానికి రాగానే స్వామి శిలను తల పై ఎత్తుకున్న వానికి ఆవహిస్తాడు. 
తాను లక్ష్మి నృసింహున్నని చెప్పుకుంటాడు. ప్రప్రధమంగా స్వామి ప్రతిమను ఇక్కడే దించారు 
కనుక దీనికి " పాదం గుడి" అని పేరు.
సింగమ భూపాలుడు బ్రాహ్మణులైన ఓరుగంటి వంశీయుల సహకారంతో స్వామిని గంగాజలంతో అభిషేకించి  ప్రతిష్ఠించారనేది ఈ స్థల ఐతిహ్యం. అప్పట్లో స్వామి వారికి ఎండ తగలకుండా ఉండాటనికి నాపరాయితో నిర్మించిన అతి సామాన్యమైన చిన్న గుడి గర్భగుడిలో నేటికీ కనిపిస్తూ భక్తులను విశేషంగా ఆకర్షిస్తొది. స్వామివారువారు వెలసిన నాటి నుండినేటికి నిర్విఘ్నంగానిత్యం పూజాభిషేకాలు జరుగుతున్నాయి..

సింగపట్ట్టణం క్షేత్ర ప్రసక్తి మదన గోపాల మహాత్మ్యము అను స్థల పూరాణంలో వుంది దాని ప్రకారం పూర్వం ఇది అరణ్య ప్రాంతం. కాశి నుండి సింగవటువు అనే బ్రహ్మచారి ఈ మగతలో అతనికి "' నీవు అహోబిలం వరకు రానక్కరలేదు. ఇక్కడనే ఉండి తపస్సు చేయి అనే ఆదేశం వినిపించింది. అది విన్న అతడు అక్కడనే ఒక పురాతన ఒక పురాతన వటవృక్షాన్ని ఆశ్రయించి తపస్సు కొనసాగించాడు. కొన్ని దినాలకు స్వామికి అతని పై అనుగ్రహం అభిషేకించి కలిగి ,, పొదలి కొండపై ఒక పాదం మోపి, అక్కడి రాతిగుట్ట పై రెందో పాదం మోపీ అతనికి దర్శనమిస్తాడు. 
ఇక్కడి నృసింహా మూర్తిని లింగాకారంలో పూజిస్తున్నారు. వికారాబాద్ సమీపంలో అనంతగిరిలో నృసింహస్వామి ఈ విధంగానే ఉంటాడు.

3.4.3 స్వామి ఆకృతి :
నృసింహ స్వామి ప్రతిష్ఠ జరిపిన కాలంలోనే ఆంజనేయ ప్రతిష్ఠ జరిగింది. ఈ క్షేత్రంలో వెలసిన స్వామి లింగాకారంలో నృసింహ స్వామి. స్వామికి ఒక కన్ను క్రిందకు, ఒక కన్ను మీదకు వుంటుంది. ఎదమకన్ను క్రింద గల భాగంలో కమలం వుంది. కమలం లక్ష్మీ స్థానం కనుక స్వామి లక్ష్మీ నృసింహుడు అయ్యడు. స్వామి వెలసిన రాతికొండకు 'శ్వేతాద్రి అని పేరు.

3.4.4 రత్నలక్ష్మి అమ్మవారు : 
శ్రీలక్ష్మీ నృసింహ స్వామి ఆలయానికి అభిముఖంగా అర కిలోమిటరు దూరంలో రత్నగిరి అనే పేరుగల ఎతైన కొండ వుంది. ఆ కొండ పై రత్నలక్ష్మి అమ్మవారిని ప్రతిష్ఠ చేశారు. 
స్వామి హృదయం పై గల కమలం లక్ష్మీ స్థానం కనుక లక్ష్మీదేవి అమ్మవారు 
భక్తులకు కనిపించడం లేదు. అందువల్ల రాణి రత్నమాంబ హయాంలో 
148 సంవత్సరాల క్రితం మద్రాసు నుండి క్రీ.శ. 1857 లో రత్నలక్ష్మీదేవి 
విగ్రహాన్ని తీసికొని వచ్చి ప్రతిష్ఠ చేశారు. ఈ కొండ పై ఆహ్లాదకరమైన 
వాతావరణంలో కొల్లాపూర్ రాజావారి పురాతనమైన విడిది భవనం వుంది. 
చుట్టుప్రక్కల గ్రామాల వాటికి విద్యార్ధులకు ఈ రత్నగిరి కొండ 'పిక్నిక్ స్పాట్ 'గా ఉపయోగపడుతోంది.

3.4.5 హరిహరాద్వైతం - వివాదం :

"లింగాకారం త్రిపుండ్రాంకాం -కేవలం జ్ఞానమూర్తినాం

ద్వంద్వాతీతం మహోపాశ్వం -అబేధంశివకేశవమ్ "

భావం : లింగారంలోనూ త్రిపూండ్రాలను , జ్నానమూర్తిత్త్వంలోనూ, ద్వందాతీతులైన శివ, కేశవులు అభేద స్వరూపులు. ఈ శ్లోకంలో శివ, కేశవుల అభేదం ప్రతి పాదించారు.
నృసింహాస్వామిని సింగపట్టణం క్షేత్రంలో లింగాకారంలో పూజిస్తూన్నరు. స్వామికి  త్రిపూండ్రం ఊర్ధ్వపుండ్రాలు ఉన్నాయి .కనుక ఇది హరిహరాద్వైత్వం. ఇచట పూజాదికాలు నిర్వర్తించేది స్మార్తులైన ఓరుగంటి వంశీయులు. శైవ, వైష్ణవ పట్టింపులు అధికంగా ఉన్న కాలంలో శైవులకు, వైష్ణవులకు అర్చకత్వం విషయంలో వివాదం ఏర్పదింది. అపుడు ఈ ప్రాంతాన్ని పాలిస్తున్న రాణి రత్నమాంబగారు పుష్పగిరి చూస్తే, స్వామి వారికి అడ్డనామాలతో పాటు నిలువు నామాలు కనిపించాయి. అందువల్ల ఈ స్వామిని దర్శించిన వైష్ణవులకు వైష్ణవుడైన ' ఎంబళ పెరుమాండ్లు ' దర్శించాలనే నియమం ఏర్పాటు చేశారు.
ఆ సమయంలోనే ఆలయపాదానికి కుడివైపున పుష్కరిణి ప్రక్కన శివాలయాన్ని కూడా నిర్మింపజేశారు. ఈ ప్రాంతపు స్మార్తులు శివ, కేశవ భేదం లేకుండా పూజాదికాలు నిర్వర్తిస్తారు. అందువలన వారికే అర్చన బాద్యతలు అప్పగించారు. ఇక్కడ స్వామి వారు హరిహరాద్వైతం అయినప్పటికీ సామాన్య ప్రజానికం వైష్ణవ రూపంలోనే గోవిందా..గోవిందా...అంటూ స్వామివారిని కొలవడం విశేషం.

3.4.6 పుష్కరిణి :
నృసింహాస్వామి ఆలయ పాదానికి కుడివైపున గల పవితర గుండంలో భక్తిశ్రద్ధలతో స్నానమాచరించినంతనే సర్వరోగాలు హరించిపోతాయని, మనసారా స్వామిని ద్యానించి తలనీలాలు సమర్పించుకొని ఈ గుండంలో స్నానాలు చేస్తే సంకటాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక్కడ తడిబట్టలతోనే మ్రొక్కులు చెల్లించుకోవడం తరతరాలుగా వస్తున్న ఆచారం.

తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడి ఈ ప్రాంతంలోని జలాశయాలు ఎండిపోయినా ఈ పరిత్రగుండన్లో మాత్రం సర్వకాల సర్వావస్థల్లో నీరు ఉండటం ప్రత్యేకత. భక్తులు మొక్కుగా బెల్లంగడ్డలు పుశ్క్రిన్దిలో వేస్తే తమ రోగాలు స్వామి హరింపజేస్తాడనేది ఈ ప్రాంత జానపదుల విశ్వాసిం.

3.4.7 దేవాలయాభివృద్ధి : మొదట నాపరాయితో అతి సామాన్యంగానిర్మించిన ఈ దేవాలయం తర్వాతి కాలంలో అభివృద్ధికి నోచుకుంది. నిజాం కాలంలో మంత్రి అయిన చందూలాల్ బహద్దూర్ గారు ఈ దేవలయాన్ని దర్శించి దీని అభివృద్ధి నిమిత్తం 240 ఎకరాల మెట్ట,12 ఎకరాల మాగాణిని అర్చకులైన  లక్ష్మీ నరసింహయ్య శాస్త్రిగారి హయాంలో అర్చకత్వానికి రాసి ఇచ్చారు. దీన్ని 'దేవునిమాన్యం ' గావ్యవహరిస్తారు. స్వామి ప్రాచినుడైనప్పటికీ ఆలయ నిర్మాణం మాత్రం చాలాకాలం తర్వాత అనగా సన్ 1215 అనగా క్రీ.శ. 1795లో నిర్మించారు. 
గర్భగుడి 40 అంకణాల మంటపం  అర్చకుడైన రాఘవ సోమయాజి కాలంలో నిర్మించారు. ఇక్కడ గల సత్రశాలను కర్నూలు నివాసి కటకం బొర్రయ్య శెట్టి కుమారుడు బారయ్య సెట్టి శాలివాహన శకం 1819 హేవిలంబి మార్గశుద్ధ భానువారం(క్రీ.శ. 1897)లో నిర్మించాడు.
  *కొల్లాపూర్ రాణి వెంకట రత్నమాంబ గారు స్వామి గాలిగోపురం కట్టించింది.
*క్రీ.శ. 1854లో స్వామికి ఎదురుగా గల గుట్టకు రత్నగిరి అనే పేరు పేట్టి, రత్నలక్ష్మీ దేవాలయాన్ని, పద్మనిలయంఅనే విలాస భవనాన్ని  రత్నమాంబ గారు కట్టించి, తోట వేయించింది.
శాలివాహన శకం 1881 లో భక్తులు తేరును చేయించగా దినికి ఎదిరె నర్సింగరావు గారు రథశాలను కట్టించినారు.
*శాలివాహన 1886లో సురభి వెంకట జగన్నాథరావు గారు ఆలయ పాదానికి కుడివైపున గలగుండానికి
స్నానాలమెట్లు కట్టించినారు.

*1890 శ్రీమతి ఇందిరాదేవి గారి స్మారకంగా, నృసింగసాగరానికి కాలువను సురభి వంశస్థులు నిర్మించారు.

3.4.8 బ్రహ్మోత్సవాలు - జాతర : '
మకరే రవి :' అన్నట్లుగా మేషరాశి లోకి సూర్యుడు ప్రవేశించినపుడు 

ఉత్తరాయన పుణ్యకాలం వస్తుంది. ఆ సందర్భంలో సంక్రాంతి మొదలుకొని
దాదాపు నెరోజుల పాటు ఈ ప్రాంతంలో జాతర జరుగుతుంది.
జనవరి 14 వ తేదిన స్వామివారికి పూజా కైంకర్యం ,మద్యాహ్నాం మొదలుకొని 
సాయంత్రం వరకు శకటోత్సవం జరుగుతుంది. ఈ రోజున శకటోత్సవం 
విశేషంగా జరుగుతుంది. 
ఫలారం బండ్ల రోజున సింగపట్టణం చుట్టుపక్కల గ్రామాల వారు ఎద్దులను బండ్లను
అలంకరించి స్వామికి ఎదురుగా గల జమ్మిచెట్ట చుట్టూ ప్రదక్షిణలు చేస్వామి వారిని దర్శించుకోవడంతో ఉత్సవం ముగుస్తుంది.
* 15వ తేదీన స్వామి వారికి కళ్యాణోత్సవం, రధం పై మోహినీసేవ గజవాహన సేవ వుంటాయి.
*16 వ తేదీన సింహవానంతో రధం పై ప్రభోత్సవం జరుగుతుంది.
* 17వ తేదీన రధోత్సవం జరుగుతుంది. సాయంత్రం 4 -30 నిమిషాలకు దాదాపు లక్షమంది స్వామివారికి తెప్పోత్సవంను రాత్రి 8 -00 గంటల నుండి ఉ 10 -00 గంటల వరకు నిర్వహించారు.
* 19 వ తేదీన శేషవాహన సేవ, తీర్ధావళి తదనంతరం పానుపు సేవలు జరుగుతాయి.
* గత 3 సంవత్సరాల నుండి ఫొండర్ ట్రస్టీ ఆధ్వర్యంలో లక్ష్మీ నృసింహస్వామి యాగాన్ని 
లోక కళ్యాణార్ధం నిర్వహిస్తున్నరు.

3.4.9 సాహితీ సంపద :

స్వామి అవతారం నృసింహుడైనప్పటికీ  కోరిన కోర్కెలను నెరవేర్చే దైవంగా ఈ స్వామి ఖ్యతినొందారు. ఈ ప్రాంత స్వామి పై అక్షరలక్షలు విలువ చేసే సాహితీ సృష్టి జరిగింది. 

సురభి వంశంలో 26 వతరం రాజైన శ్రీవేంకట జగన్నాధరావు కాలంలో కవి సార్వభౌబిరుదాంకితుడైన  హోసదుర్గం కృష్ణమాచార్యూలు సింగపట్నం నృసింహస్వామికి
అంకితంగా"లక్ష్మీ నృసింహవిలాసం" అను సంస్కృత చంపువును రచించాడు.

"సింగపట్న నృసింహ శతకం" ను, సింగపట్టణ నరసింహ విలాసం"
"సింగపట్టణ నృసింహ క్షేత్ర మహాత్మ్యం" కావ్యాలను రచించారు.
సింగపట్టణ నృసింహశతకం మకుటం ' సింగవట నరసింహ ' సింగపట్టణం నివాసియైన శ్రీవత్సస గోత్రీకులైన ఓరుగంటి లక్ష్మీ నారాయణగారు " సింగపట్నం లక్ష్మీ నృసింహస్వామి చరితం" అను వచన్కృతిని రచించారు.
ఓరుగంటి సంపత్ కుమార్ శర్మ--------- ' నవరత్నస్తోత్రమాల ' ను రచించారు. 

3.4.10 ప్రత్యేకతలు - ముగింపు :
* ఈక్షేత్రంలో స్వామి నృసింహుడు అయినప్పటికీ లింగరూపంలో వుంటాడు. 
స్వామికి త్రిపుండ్రాలు, ఊర్ధ్వ పుండ్రాలు వుండటం వలన స్వామి హరిహరాద్వైతంనకు 
ప్రతిరూపంగా నిలుస్తాడు.
*స్వయం భూ : అయిన స్వామికి అచకులుగా స్మార్తులైన శ్రీవత్స గోత్రీకులు, 
ఓరుగంటి వంశీయులు ఇప్పటికి కొనసాగుతూనే వున్నారు
* నృసింహస్వామికి అభిముఖంగా 1 కి.మీ. దూరంలో గిరిపై రత్న లక్ష్మీ అమ్మవారు వెలిశారు.
*సంకటాలు వున్న వారు ఈ ఆలయంలో గండదీపం మోసి తమ మ్రొక్కులను చెల్లించుకుంటారు. ఈ స్వామికి మ్రొక్కు క్రింది  గుమ్మడికాయలు సమర్పించుకుంటారు. 
గొల్లదాసరులు ఈ స్వామి సేవలో తరిస్తారు.
* భక్తులు పవిత్ర గుండలో బెల్లం గడ్డలు వేసి తమ బరువులను తొలగించుకుంటారు.
*స్వామి ఆలయ పాదానికి ఎడమవైపున నృసింహసాగరం ప్రతీ 7 సంవత్సరాలకు 
ఒకసారి మాత్రమే పూర్తిగానిండి అలుగు పారుతుంది.
* భక్తులకు స్వామి ఆవాహనయి భూత ,భవిష్యత్ కాలాలను గురించి చెప్తాడు.
*స్వయం భూ అయిన ఈ స్వామి ఏకాదికేడాది క్రమక్రమంగా పెరుగుతున్నాడని భక్తులూ విశ్వసిస్తున్నారు.

స్వామి ఆవిర్భవించిన సందర్భంలో...
స్వామి ----- నృసింహూడు, భూపాలుడు ---- సింగమనాయుడు
గ్రామం ---- సింగపట్ట్ణం, తొలి అర్చకుడు ---- నరసింహయ్య శాస్థ్రి

కాకతాళీయంగా ఒకటే కావడం వెశేషంగా చెప్పుకోవచ్చు.
ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నొ వింతలకు, వెశేషాలకు, విశ్వాసాలకు నిలయం ఈ సింగపట్ట్ణణం. శ్రీ లక్ష్మీ నృసింహస్వామి జాతర ఈ ప్రాంత జనుల సంస్క్రతికి దర్పణం పడుతుంది. కుల, మత వర్గాలకు అతీతంగా జానపదులను ఒకేత్రాటి పై నడుపుతోంది. వర్తమాన పరిస్థితుల ప్రభావాన్ని తన దరికి చేరనివ్వకుండా భక్తుల పాలిట కోరిన కోర్కెల కొంగు బంగారమై ఆదర్శంగా నిలుస్తోంది.
[ఆధారం :"కొల్లాపూర్ ప్రాంతంలో జాతరలు ఒక పరిశీలన "
తూర్పింటి నరేశ్ కుమార్
]

26, ఫిబ్రవరి 2010, శుక్రవారం

తెలుగు నెట్ పేపర్ 2008 :NET 2008 JUNE

2008 జూన్ మోడల్ పేపర్ :2
ఈ విభాగంలో మొత్తం 50 ప్రశ్నలు ఉంటాయి . ప్రతి ప్రశ్నకు 2 మార్కులు.
1.తాలవ్యీకరణానికి ఉదాహరణ
చిలుక...ఎలుక......కిళి.....కిటి....
2.కలిమి అనగా
తద్దితం...క్త్వార్థం...కృదంతం...శత్రర్థకం
3.వర్ణవ్యత్యయం జరిగిన పదం :
బత్తి...అరదం...వంకాయ....నవ్వుటాల.
4.అతడు కళాశాలకు వెళ్ళి తిరిగి వచ్చాడు...ఇది ఏ వాక్యం.....
సామాన్య...సంశ్లిష్ట...సంయుక్త...క్రియారహిత
5.దంత మూళీయం :
ర...ట.....త......హ......
6.మనుచరిత్ర కథ తీసుకోబడిన గ్రంధం :
గరుడ....మార్కండేయ....సూత.....వరాహ....
7.హరికథ పితామహుడు
నారయణ దాసు,,,రామదాసు,,,,నాజర్...బెనర్జి
8.పారిజాతాపహరణంలో సత్యభామ చేసిన వ్రతం
గౌరీవ్రతం...పుణ్యక....పారిజాత....పుష్పక....
9.శ్రీకాళహస్తి మాహాత్మ్యంలోని కథ
తిన్నడి కథ...సిరియాళుడు...నిగమశర్మ...బెజ్జమహాదేవి....
10.మన్నారుదాసు విలాస యక్షగాన కర్త
మధుర వాణి...ముద్దుపళని.....రంగాజమ్మ....రామభద్రాంబ
11.సైనికుడి ఉత్తరం ఎవరిది ?
రాయప్రోలు.....కుందుర్తి.....తిలక్....శ్రీశ్రీ...
సూతపురాణం ఏ వాదానికి చెందినది?
స్త్రీవాదం.....హేతువాదం.....మైనారిటీ...వైయక్తిక....
13.గబ్బిలానికి కావ్యగౌరవం కలిగించినడి.
విశ్వనాథ....వేదుల.....జాషువా....నండూరి .

ఇది నా సిద్దాంత గ్రంధం :



"కొల్లాపూర్ ప్రాంతంలో జాతరలు -ఒక పరిశీలన "

21, ఫిబ్రవరి 2010, ఆదివారం

మూసీలో ప్రచురితమైన నా వ్యాసం


మూసీ లో ప్రచురితమైన నా వ్యాసం


నన్నయ:ఆంధ్రమహాభారతానువాదం



నన్నయ
-
తూర్పింటి నరేశ్ కుమార్
తెలుగు సాహిత్యంను
చదువుకుంటున్న
ప్రతి విద్యార్థి తెలుసుకోదగ్గ పేరు నన్నయ!!!!! ఆయన గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.... ..... 21వ శతాబ్దంలో నేడు మనం చదువుకుంటున్న సాహిత్యానికి మూలవిరాట్టు.. .....సాహిత్యానికి పెద్దన్నయ్య .....ఈ నన్నయ!!!!! తెలుగు సాహిత్యానికి ఓ దిశా నిర్దేశాన్ని చేసిసాహిత్యాన్ని పరిపుష్టం చేసిన ఘణనీయుడు.... అంతవరకు సాహిత్యానికి రూపురేఖలు లేని కాలంలో.... సరస్వతికి అలంకరణలు చేసిన గొప్పసాహితీవేత్త. అస్తవ్యస్తంగా పడిన తెలుగు భాషామ తల్లి బీజాక్షరాలను
ఓ చోటికి చేర్చిన ఆదికవీంద్రుడు....
శబ్దశాసనుడు ....
ఈయన కాలం 11 వ శతాబ్దం.తూర్పు చాళుక్య వంశానికి రాజైన రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి.
నన్నయ్య గారు ఆది కవి. వీరు మహా భారతాన్ని తెలుగులో వ్రాయ ప్రారంబించి, అందులో మొదటి రెండు పర్వాలు పూర్తి చేసి, అరణ్యపర్వాన్ని సగం వ్రాసి కీర్తి శేషులు అయ్యారు. వీరు తెలుగు భాష కు ఒక మార్గాన్ని నిర్దేశించినారు. వీరి తరువాత కవులందరూ ఒకసారి కాకపోతే ఒక సారి అయినా నన్నయ్య గారి అడుగు జాడలను అనుసరించిన వారే. ఆంధ్రభాషకు కావ్యము, వ్యాకరరణము రెండింటిని ప్రసాదించాడు నన్నయ్య భట్టు. నన్నయ్య గారు రాజమహేంద్రవరం లో వుండి ఈ మహా భారతాన్ని తెలుగులో వ్రాసినారు.అందుకు సరియైన వ్యక్తి నన్నయభట్టు, సంహితాభ్యాసుడు. నానాపురాణ విజ్ఞాన నిలయుడు; అవిరళ జపహోమ తత్పరుడు . ఆపస్తంబ సూత్రుడు, ముద్గల గోత్రుడు, పురాణ విజ్ఞానం, లోక జ్ఞానం, సంస్కృతాంధ్రములలో కవిత్వం చెప్పగల మహా ప్రతిభాశాలి.
రాజ రాజ నరేంద్రుడు నన్నయభట్టారకున్ని నిండుసభలో పిలిపించి తమ పూర్వీకుల చరిత్ర ఐన [చంద్ర వంశ ప్రభువుల ] పాండునందనల చరిత్రలను వినాలని తన మనోగతాన్ని వినిపించాడు.దానికి ఒప్పుకున్న నన్నయ కు దాన్ని ఎలా మొదలు పెట్టాలో తన సహాధ్యాయి నారాయణ భట్టు సహకారం తీసుకున్నాడు. నన్నయకు నారాయణ భట్టు సహాయంగా నిలిచినాడు. నారాయణ భట్టు వాఙ్మయదురంధరుడు. అష్టభాషాకవి శేఖరుడు.

పురాణ యుగము/భాషాంతరీకరణ యుగము

సహాధ్యాయులైన నారాయణ నన్నయ భట్టులు భారత యుద్ధానికి సంసిద్ధులైన కృష్ణార్జునులవలె భారతాంధ్రీకరణకు పూనుకొని ఒక విజ్ఞాన సర్వస్వంగా దానిని రూపొందించే ప్రయత్నం ప్రారంభించినారు; తెనుగు కావ్యభాషాస్వరూపానికి పూర్ణత్వం సాధించి,పందితులూ పామరులూ మెచ్చుకొనదగిన శైలిని రూపొందించి, తరువాతి కవులకు మార్గదర్శకులయ్యారు. ఆంధ్ర భాషా చరిత్రలో నన్నయ ,నారాయణులు యుగపురుషులు. రాజరాజనరేంద్రుని పాలన కాలంలో సాహిత్యపోషణకు అనుకూలమైన ప్రశాంతవాతావరణం క్రీ.శ. 1045-1060 మధ్యలో ఉంది. ఆ కాలంలోనే భారతాంధ్రీకరణ జరిగి ఉంటుంది. వీరు తెలుగు భాష కు ఒక మార్గాన్ని నిర్దేశించినారు. వీరి తరువాత కవులందరూ ఒకసారి కాకపోతే ఒక సారి అయినా నన్నయ్య అడుగు జాడలను అనుసరించిన వారే.నన్నయ యుగముదీనిని "పురాణ యుగము" లేదా "భాషాంతరీకరణ యుగము" అని అంటారు.
మొదటి శ్లోకం :

'నన్నయ ఆంధ్ర మహాభారతము శ్రీకారము త్రిమూర్తులను స్తుతించే ఈ సంస్కృత శ్లోకముతో జరిగినది.''
'''శ్రీ వాణీ గిరిజా శ్చిరాయ దధతో వక్షో ముఖాంగేషు యే'''
'''లోకానాం స్థితి మావహన్త్యవిహతాం స్త్రీపుంసయోగోద్భవాం'''
'''తేవేదత్రయమూర్తయ స్త్రీపురుషా స్సంపూజితా వస్సురై'''
'''ర్భూయాసుః పురుషోత్తమాంబుజ భవ శ్రీకంధరా శ్శ్రేయసే'''
(లక్ష్మీ సరస్వతీ పార్వతులను వక్షస్థలమునందును, ముఖమునందును, శరీరము నందును ధరించి లోకములను పాలించువారును, వేదమూర్తులును, దేవపూజ్యులును, పురుషోత్తములును అగు విష్ణువు, బ్రహ్మ, శివుదు మీకు శ్రేయస్సు కూర్తురు గాక!)

నన్నయగారి చివరిపద్యం:

భారతంలో నన్నయగారి చివరిపద్యం - శారదరాత్రుల వర్ణన -

శారదరాత్రులుజ్వల లసత్తర తారక హార పంక్తులన్
జారుతరంబులయ్యె వికసన్నవ కైరవ గంధ బంధురో
దార సమీర సౌరభము దాల్చి సుధాంశు వికీర్యమాణ క
ర్పూర పరాగ పాండు రుచి పూరము లంబరి పూరితంబులై

(శరత్కాలపు రాత్రులు మెరిసే నక్షత్రాల పట్ల దొంగలైనాయి. - అంటే వెన్నెలలో చుక్కలు బాగా కనుపించటము లేదు - వికసించిన కలువల సుగంధాన్ని మోసుకుపోయే చల్లగాలి తో, పూల పరాగంతో ఆకాశం వెలిగి పోతున్నది. చంద్రుడు కర్పూరపు పొడి వంటి వెన్నెలను విరజిమ్ముతున్నాడు)
తాత్పర్యం: అవి శరత్కాలంలోని రాత్రులు; మిక్కిలి ప్రకాశమానాలైన నక్షత్రమాలికలతో కూడి ఉన్నవి, వికసించిన కొంగ్రొత్త తెల్ల కలువల దట్టమైనసుగంధంతో కూడిన గొప్పగాలి యొక్క పరిమళాన్ని వహించాయి, అంతటావెదజల్లబడిన కప్పురపు పుప్పొడివలె ఆకసాన్నిఆవరించిన చంద్రుడి వెన్నెలవెల్లువలు కలిగి మిక్కిలి సొగసుగా వున్నాయి.దీంట్లో నన్నయ తనమహాభినిష్క్రమణని సూచించాడా?
విశేషంలో వివరణ ఇలా వుంది: కొందరు పండితులు
ఈ పద్యంలోని చివరిపదగుంఫనం - పాండురుచిపూరములు + అంబరపూరితంబులై -
అని విరవటానికి బదులు - పాండురుచిపూరములన్ + పరపూరితంబులై- అని సంధి విశ్లేషిస్తే,నన్నయ చివరిమాట "పరపూరితంబులై" అని ఏర్పడుతుంది. అంటే భారతం పరులుపూర్తి చెయ్యాల్సిందేనని నన్నయ తన మరణాన్ని సూచించాడు!
=======================
======================================
బాదామి చాళు క్యులు : పశ్చిమ చాళు క్యులు

బాదామి చాళుక్య రాజైన రెండవ పుల కేశి (క్రీ.శ.608–644) తూర్పు దక్కన్ ప్రదేశాన్ని(ఇప్పటి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కోస్తా జిల్లాలను) క్రీ.శ. 616 సంవత్సరంలో, విష్ణుకుండినుని ఓడించి, తన అధీనంలోకి తీసుకొన్నాడు. రెండవ పులకేశి సోదరుడైన కుబ్జ విష్ణువర్ధనుడు అన్న అనుమతితో వేంగిలో స్వతంత్ర రాజ్యం స్థాపించాడు. ఈ ప్రాంతం క్రమంగా వేంగి సామ్రాజ్యంగా పరిణితి చెందింది. కాని రాజరాజ నరేంద్రుని కాలానికి అంతఃకలహాల వలన, శత్రువుల దండయాత్రల వలన వేంగి గణనీయంగా బలహీనపడింది. అయితే తెలుగు సాహిత్యం మాత్రం వ్రేళ్ళూనుకొని అప్పటినుండి మహావృక్షంగా విస్తరించింది. తూర్పు చాళుక్యులు తెలుగు సాహిత్యానికి తొలిపలుకులు పలికారు. తొమ్మిదో శతాబ్దం రెండవ అర్థభాగంలో రెండవ విజయాదిత్యుని పరిపాలనాకాలంలో తెలుగులో కవిత్వం ప్రారంభం అయిందని అద్దంకి, కందుకూరులలో నున్న పాండురంగ శిలాశాసనాలు చెబుతున్నాయి. ప్రఖ్యాతి గాంచి, ప్రాచుర్యంలోకి వచ్చిన సాహిత్య కార్యకలాపాలు 11వ శతాబ్దంలో కవిత్రయంలో మెదటి వాడైన నన్నయ్య మహాభారతాన్ని తెనిగించడం ప్రాంరంభించేవరకు జరగలేదు.
=====================================================================
ఆణిముత్యాలు

మనమునకుఁ బ్రియంబును హిత
మును బథ్యముఁ దథ్యమును నమోఘము మధురం
బును బరిమితమును నగు పలు
కొనరఁగ బలుకునది ధర్మయుతముగ సభలన్ !


సభలో మనసుకు ప్రియంగా ఉండే మంచి వాక్యాలే చెప్పాలి. చాలా తక్కువగా మాత్రమే మాట్లాడాలి.
అదీ సరళంగా, ఎదుటివారు నొచ్చుకొనని రీతిగా మాట్లాడాలి. తెలుగు సాహిత్యంలో ప్రతి ఒక్కరు ఈ పద్యాన్ని నేర్చుకోవాలి .

సత్యవాక్య గొప్పదనం :
ఆణిముత్యాలు
నుతజల పూరితంబులగు నూతులు నూఱిటికంటె సూనృత
వ్రత! యొక బావి మేలు, మఱి బావులు నూఱిటికంటెనొక్క స
త్క్రతు వది మేలు, తత్క్రతు శతంబునకంటె సుతుండు మేలు, త
త్సుతు శతకంబుకంటె నొక సూనృత వాక్యము మేలు చూడగన్

నూరు నూతులకంటె ఒక బావి (దిగుడు మెట్లున్నది) మంచిది. నూరు బావులకంటె ఒక యజ్ఞము మంచిది. అటువంటి నూరు క్రతువులకంటె ఒక కుమారుడు మేలు. నూరుగురు కొడుకులకంటె ఒక సత్యవాక్యము మేలు.
========================================================================
నన్నయ - శ్రీమదాంధ్రమహాభారతము - అరణ్యపర్వము

అర్జునుడు పరమేశ్వరుని స్తోత్రము చేయుట

దండకము.

శ్రీకంఠ లోకేశ లోకోద్భవస్థానసంహారకారీ పురారీ మురారి ప్రియా
చంద్రధారీ మహేంద్రాదిబృందారకానందసందోహసంధాయి పుణ్యస్వరూపా
విరూపాక్ష దక్షాధ్వరధ్వంసకా దేవ నీదైవ తత్త్వంబు భేదించి
బుద్ధిం బ్రధానంబు గర్మంబు విజ్ఞాన మధ్యాత్మయోగంబు సర్వ
క్రియాకారణం బంచు నానాప్రకారంబులన బుద్ధిమంతుల్ విచారించుచున
నిన్ను భావింతు రీశాన సర్వేశ్వరా శర్వ సర్వజ్ఞ సర్వాత్మకా నిర్వికల్ప
ప్రభావా భవానీపతీ నీవు లోకత్రయీవర్తనంబున మహీవాయుఖాత్మాగ్ని
సోమార్కతోయంబులం జేసి కావించి సంసారచక్రక్రియాయంత్రవాహుండవై
తాదిదేవా మహాదేవ నిత్యంబు నత్యంతయోగస్థితిన నిర్మలజ్ఞానదీప
ప్రభాజాలవిధ్వస్తనిస్సార సంసార మాయాంధకారుల్ జితక్రోధ
రాగాదిదోషుల్ యతాత్ముల్ యతీంద్రుల్ భవత్పాదపంకేరుహధ్యాన
పీయూషధారానుభూతిన సదాతృప్తులై నిత్యులై రవ్యయా భవ్యసేవ్యా
భవా భర్గ భట్టారకా భార్గవాగస్త్యకుత్సాది
నానామునిస్తోత్రదత్తావధానా
లలాటేక్షణోగ్రాగ్నిభస్మీకృతానంగ భస్మానులిప్తాంగ గంగాధరా నీ
ప్రసాదంబునన సర్వగీర్వాణగంధర్వులున
సిద్ధసాధ్యోరగేంద్రాసురేంద్రాదులున
శాశ్వతైశ్వర్య సంప్రాప్తులై రీశ్వరా విశ్వకర్తా సురాభ్యర్చితా నాకు
నభ్యర్థితంబుల్ ప్రసాదింపు కారుణ్యమూర్తీ త్రిలోకైకనాథా
నమస్తే నమస్తే నమః.
========================================================================
మన మహాభారతం వ్యాసుని సంస్కృతమూలానికి అనువాదం కాదు....!!!!!

కవిత్రయం తెలుగువారికి ప్రసాదించిన ఆంధ్రమహాభారతం వ్యాసుని సంస్కృతమూలానికి అనువాదం కాదు. అనుసృజనం. పునసృష్టి .

1. మూలంలోని హరివంశాన్ని తెలుగు భారతంలో కలుపలేదు.ఇలా భారత గాధను తెలుగులో పాండవనాయకంగా మలచారు.
2. వ్యాసమహర్షి రచనలో శాస్త్రప్రతిపాదనా దృక్ధం, ప్రబోధ ప్రవృత్తీ ప్రముఖంగా ఉన్నాయి. కావ్యస్పృహ తక్కువ. అయితే తెలుగు భారతం ప్రధానంగా కావ్యేతిహాసం. "కావ్యరూప శాస్త్ర ఛాయాన్వయి".
3. వ్యాస భారతంలో శాంతరసం ప్రధానంగా ఉంది. తెలుగుభారతం ధర్మ వీర రస సమన్వితం. రస సమన్వయ రూపకం.
4. వేదం శబ్ద ప్రధానం. ఇతిహాస పురాణాలు అర్ధ ప్రధానాలు. వ్యాస భారతం అర్ధ ప్రధానమైన శాస్త్రేతిహాసం. కవిత్రయ భారతం ఉభయ ప్రధానమైన కావ్యేతిహాసం.
5. వ్యాసుని శ్లోక రచనా శైలికంటె నన్నయ పద్య రచనాశైలి విశిష్టమైనది, రస వ్యంజకమైనది. అనంతర కవులు నన్నయనే అనుసరించారు.
6. కవిత్రయం యధానువాదంచేయలేదు. స్వతంత్రానువాదంచేశారు. కధను మార్చలేదు. కాని కొన్ని వర్ణనలను తగ్గించారు.
కొన్నింటిని పెంచారు. కొన్ని భాగాలను సంక్షిప్తీకరించారు.
=========================================================
నన్నయ పై కన్నడ పంపన గారి ప్రభావం :
నన్నయ : చంపక మాలలు : 240 చంపకాలు [3 కృతులలో ] :
దేశి ఛందస్సులో కందాలు : 1219 కందాలు :
పంపన : 409చంపకాలు దేశి ఛందస్సులో 730 కందాలు

=====================================================================================
నన్నయ సామెతలు - పలుకుబళ్ళు :
* కుంతి కడుపు చల్లగా పుట్టిన ఘన బుజుడు [ ఆదిపర్వం 6 -19]
*వెతుకుతున్న తీగ కాళ్ళకు తగిలిందనే -----సామెత
*గుండెలమీద చెయ్యి వేసుకుని హాయిగా నిద్ర పోవడం -------నుడికారం
*వంటయిల్ కుందేలు సొచ్చె [ ఆదిపర్వం 6 వ అశ్వాసం ]
*అర్జుని వలని భయము సెడి రొమ్మును జేయిడి నిద్రవోయె [ ఆదిపర్వం 6 -63 ]

=========================================================================================
"సుప్రసిద్ధ వాఙ్మయమింకను గన్పడలేదు. చిక్కనిదానికై యంధకారములో తడవులాడుటకంటె, చెవులకింపుగా తెలుగు భారతమును "శ్రీవాణీ"యని మొదలు పెట్టి గోదావరీ తీర రాజమహేంద్రమున, రాజరాజు సన్నిధిని, పాడుచున్న ప్రసిద్ధాంధ్ర కావ్యకవి "నన్నియభట్టు"ను చూతముగాక రండు." -----కాళ్ళకూరు నారాయణరావు.
అని ' కాళ్ళకూరి ' గారు చెప్పిన మాటలు సదా చిరస్మరణీయాలు .
----------------------------------మీ తూర్పింటి .




ఈ వ్యాసం ఇంకా పూర్తి కాలేదు....మిగతాది త్వరలో....

తెలుగు భాషాదినోత్సవాన్ని పురస్కరించుకొని రాసిన నా ప్రత్యేక వ్యాసం

ప్రాభవం కోల్పోతున్న తెలుగు భాషకు జవసత్త్వాలు తిరిగి వచ్చేనా ?
                                               -----తూర్పింటి నరేశ్ కుమార్

"చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా - గతమెంతో ఘనకీర్తి గలవాడా "
...అన్న వేములలపల్లి శ్రీకృష్ణ చెప్పిన మాటలు అక్షర సత్యాలు. క్రీ.శ. 1 వశతాబ్దిలో ' నాగబు ' శబ్దంతో మొదలైన తెలుగు సాహితీ ప్రస్థానం నన్నయ, తిక్కన ల కాలంలో మొగ్గలు తొడిగి కృష్ణరాయల కాలంలో స్వర్ణయుగంగా పేరొందినది.
20వ శతాబ్దంలో తెలుగు సాహిత్యంలో ఎన్నో ప్రక్రియలు చోటు చేసుకుని 'సాహితీభారతి 'తనువు పులకరించిపోయింది.ఎంతో ఘన చరిత్ర కలిగినప్పటికినీ...ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తే తెలుగు భాషా తేజం మసక బారుతున్నదా? అన్న సందేహం కలుగక మానదు. పోటీ ప్రపంచంలో ఉపాధి అవకాశాలు సన్నగిల్లడం...మాతృభాషాపై తల్లిదండ్రులు ఆసక్తి చూపకపోవడం వంటి కారణాల వల్ల తెలుగు భాష క్రమక్రమంగా తన ఉనికిని కోల్పోతున్నది.
మాతృభాషపై మమకారమేదీ....!!!!
"ఉగ్గుపాలనుండి ఉయ్యాలలోనుండి
అమ్మ పాడినట్టి భాష
తేనె వంటి మందు వీనులకు విందు
దేశభాషలందు తెలుగు లెస్స ".

అని మిరియాల రామకృష్ణ గారు పేర్కొన్నట్లుగా
: శిశువు తల్లి ఒడిలో పాలు తాగుతూ , తల్లి ముఖం నుండి నేర్చుకున్న భాషయే మాతృభాష. వ్యక్తిని పరిపూర్ణ మానవుడిగా ఉత్తమ పౌరుడిగా తీర్చిదిద్దేది మాతృభాషయే! భూమిపై జన్మించిన జీవరాసుల్లో బుద్ధి జీవియే మానవుడు .
భాషా సామర్ధ్యం మిగతా జీవులనుండి అతడిని వేరుచేస్తుంది.
భాష అంటే ఒక జాతి చరిత్ర .
భాష అంటే ఆ జాతి జీవనాడి .
శరీరం పనిచేయడానికి హృదయం ఎంత అవసరమో ఒక జాతికి భాష అటువంటిదే అని ఘంటాపథంగా చెప్పవచ్చును. భాషను వదులుకుంటే మన చేజేతులా మన చరిత్రను , సంస్కృతిని మనమే నాశనం చేసుకున్నట్లే. మనిషికి మనస్సు ,మేధ ముఖ్యమైనవి . విద్య మనోవికాసాన్ని , మేధో వికాసాన్ని కలిగిస్తుంది. మనోవికాసానికి సాహిత్య విద్య
మేధో వికాసానికి శాస్త్రీయ విద్య అవసరం.
ఈ రెండింటికీ భాష మూలం.
అన్నం పెట్టేది అవసరానికి ఆదుకునేది ఈ ప్రపంచంలో 'భాష అన్నది జగమెరిగిన సత్యం .
జాతిని , సంస్కృతిని , మానవ సంబంధాలను రూపొందించేది మాతృభాషనే అన్న భావాన్ని
మొక్కగా ఉన్నప్పుడే బాల బాలికల్లో మనం నిర్మించగలగాలి. ఆంగ్లేయుల నుండి స్వేచ్ఛ పొంది 60 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ , వారి మానస పుత్రిక అనబడే ' 'ఆంగ్లభాష ' బారినుండి మనం తప్పించుకోలేకపోతున్నాం.ఈ కాలంలో ఇంగ్లీషు పై వ్యామోహం తగ్గక అది క్రమేపి పెరుగుతూ వస్తుంది. మనది త్రిభాషా సూత్రం. మన విద్యార్థులకు ఏ భాషా సరిగా తలకెక్కదు. మన భాషపై మనకు పట్టు సరిగా ఉండదు. చివరకు నేటి విద్యార్థి జీవితం " రెంటికి చెడ్డ రేవడిలా " భవిష్యత్ అగమ్యగోచరమవుతుంది. మాతృభాష తెలుగు గల విద్యార్థి ఎల్.కె.జి స్థాయినుండి ఆంగ్లంలో విద్యనభ్యసించినపుడు సహజంగా అతను తన భాషా విలువలను , మూలాలను మరిచిపోవడం ఖాయం. 'పరభాషా మాధ్యమంలో విద్యాబోధన సోపానాలు లేని సౌధం లాంటిదని' విశ్వకవి రవీంద్రుడు పేర్కొన్న విషయం ఇక్కడ గమనార్హం. ఉన్నత సామాజిక హోదాకలవారు , గొప్ప గొప్ప చదువులు చదివిన వారు తమకు తమకు తెలుగు బొత్తిగా రాదని చెప్పుకోవడం " స్టేటస్ సింబల్ "గా భావిస్తున్నారనే  విషయం మాత్రం అక్షరసత్యం .
పరభాషా వ్యామోహంలో తన స్వరూపాన్ని కోల్పోతున్న మాతృభాష!
సంస్కృతం లోని చక్కెర పాకంబు
అరవ భాషలోని అమృత రాశి
కన్నడంబులోని కస్తూరి వాసన
కలిసి పోయె తేట తెలుగునందు " .

అని ఓకవి చెప్పినట్లుగా ...ఇతర భాషలలోని విశిష్ట లక్షణాలను తనలో ప్రోది చేసుకొని
వేల సంవత్సరాలనుండి తరతరాలుగా తన అస్థిత్వంను నిల్పుకుంటున్న తెలుగు భాష
21 వ శతాబ్దంలో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నది.
అంటే తెలుగు రాష్ట్రమని , తెలుగు దేశమని , తీయనైన తెలుగు
తేట తేటల తెలుగు , దేశభాషలందు తెలుగు లెస్స ...వంటి వాక్యాలు ఒకప్పుడు వాడుకలో ఉండేవని భావితరాలవారు చెప్పుకోవాల్సిన దుస్థితి ఇంక ఎంతో దూరంలో లేదు.
ఒక సర్వే ప్రకారం ...
"300 సంవత్సరాల తర్వాత తెలుగు భాష అనేది అసలే ఉండదనీ ,
ఆ కాలంలో మళ్ళీ పరిశోధనలు చేసి తెలుగు భాష ,లిపి ఇలా
డాక్టరేట్ పట్టాలు పొందే సౌలభ్యం కలదు.
పాలక వర్గాల విధాన నిర్ణయాలు , అలసత్వం , సరళీకరణ , ప్రభుత్వ ధోరణులు
కాన్వెంట్ నాగరికతకు బీజాలు వేసింది.వీటిల్లో అ , ఆ లకు బదులు ఎ , బి ,సి , డి లు నేర్పిస్తారు. ఇక్కడి ఇంగ్లీష్ మీడియం చదువులు మమ్మీ , డాడీ ల సంస్కృతి , ఆంటీ - అంకుల్ ల శకానికి పునాది రాళ్ళు లేస్తున్నాయని చెప్పవచ్చును. ఉదయమనగా ఇంటినుండి బయలుదేరిన 7 ఏళ్ళచిన్నారి సాయంత్ర సమయానికి మోయలేనిపుస్తకాల భారంతో , అలసిపోయిన ముఖంతో ఇంటికి వచ్చి 'మమ్మీ ' అని పిలుస్తాడు. మమ్మీ అనగానే తల్లులు తమ చిన్నారి ఇంగ్లీష్ లో పిలుస్తున్నాడని మహానందపడి చంకలు గుద్దేసుకుంటారు.
కాని మమ్మీలు అనగా ఈజిప్ట్ భాషలో ' శవాలు ' అని ఎంత మంది తల్లిదండ్రులకు తెలుసు?
ఈ మమ్మీడాడీల కల్చర్ మధ్య తరగతి నుండి
దిగువ మధ్య తరగతికి శరవేగంగా వ్యాపిస్తోంది. .
కార్పోరేట్ కల్చర్ , పోష్ నడవడిక , ప్రతీ చిన్న విషయంలో పాశ్చాత్యీకరణకై అర్రులు చాచడం
పబ్ లో 'హగ్ ' లు ...డిస్కోథెక్ లలో 'బెల్లీ ' డ్యాన్స్ లు .... పార్టీలలో 'పార్టీ ' లకై సెర్చింగ్ లు... హైటెక్కులు డాలర్ కలలు ...వెరసి యువతకు తమ మాతృభాష అంటేనే అదో బ్రహ్మపదార్థంలా వింతగ చూసే పరిస్థితి నేడు నెలకొన్నది.
గరిమెళ్ళ సత్య నారాయణ గారు అన్నట్లుగా ...............................

"ఇం గ్లీ షు లేకుంటె ఇహ లోకములాలోన
ఎవ్వడైనా బ్రతుకగలడా
గువ్వలా బువ్వ తినగలడా
ఆంగ్ల జవ్వనులతో షేకుహాండులు పొందగలడా! అన్నది ఇక్కడ గమనార్హం ?!
నవతరం తల్లిదండ్రులు పిల్లలకు వారి యిష్టాయిష్టాలతో
ప్రమేయం లేకుండానే బలవంతగా పోటీ పరీక్షలు లక్ష్యాలను నిర్దేశిస్తున్నారు .
6వ తరగతి లోనే IIIT పౌండేషన్ చదువులు .... హావ్వ !ఇదేమి చోద్యం నక్కకు నాకలోకానికి
పొంతన కుదురుతుందా?
బలవంతమైన బరువు చదువులు విద్యా ర్థుల బాల్యాన్ని కుంగదీస్తున్నాయి .
పసి వయస్సులో ఫౌండేషన్ కోర్సులు కోర్సులు, పుస్తకాల మోతలు విద్యార్థికి
పెనుభారంగ పరిణమిస్తోంది.
చదువుల్లొ ఆటవిడుపులు లేక ,గమ్యాన్ని చేరు కోలేక ,మానసిక ఒత్తిడులు తట్టుకోలేని
కొంతమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్న దుస్థితి నేడు నెలకొన్నది .