మన మువ్వన్నెల పతాకం

India is best - MOBANGO - Free
mobile applications, games, themes, ringtones, wallpapers and videos
for your mobile phone

6, ఫిబ్రవరి 2009, శుక్రవారం

తెలుగు సాహిత్యం :తూర్పింటి

తెలుగు సాహిత్యం
· అమరావతి స్థూపం 'నాగబు ' లో నడయాడిన నా తెలుగు భాష ..
· హాల 'గాధాసప్తశతి' లో హరివిల్లులా మెరిసిన నా తెలుగు భాష ..
· ధనంజయుని 'కలమళ్ళ శాసనం' లో కాంతులీనిన నా తెలుగు భాష ..
· నన్నయ భారతంలో 'అందెరవళులు' వేసిన… నా తెలుగు భాష ..
· తిక్కన కలంలో 'తెలుగు తీయందనాలూదిన' ….నా తెలుగు భాష ....
· ఎర్రన 'సూక్తి వైచిత్రిలో' సుతారంగా మీటిన… నా తెలుగు భాష .....
· శివకవి యుగంలో 'అట్టడుగు వర్గాలకు' అగ్ర తాంబూలమిచ్చిన …నా తెలుగు భాష ...
· శ్రీనాథుని సాహిత్యంలో 'స్వర్ణాభిషేకం' నొందిన… నా తెలుగు భాష .................
· ప్రబంధ యుగంలో 'పరిపుష్టమై' పరిఢవిల్లిన… నా తెలుగు భాష ..................
· దక్షిణాంధ్ర యుగంలో 'దశ దిశలా ధనుష్టాంకారం' చేసిన… నా తెలుగు భాష...
· కందుకూరి సాహిత్యంలో 'అమృత ధారలై' ప్రవహించిన …నా తెలుగు భాష...
· గురజాడ 'మాత్రా చంధస్సు'లో మేలి జాతి ముత్యంలా మెరిసిన …నా తెలుగు భాష...
· రాయప్రోలు 'తృణకంకణం' లో కేరింతలు కొట్టిన …నా తెలుగు భాష...
· కృష్ణశాస్త్రి కవనంలో 'కాంతి పుంజాలుగా' గంధర్వలోకానికేగిన… నా తెలుగు భాష...
· జాషువా ఆవేదనా ఝరిలో 'అశ్రువై' పెల్లుబికిన …నా తెలుగు భాష...
· శ్రీ శ్రీ "ప్రస్థానంలో 'ప్రజాశ్రేయస్సుకై' పల్లవించిన…నాతెలుగు భాష...
· ఆధునిక సాహితీ ప్రక్రియలు... 'సాహితీ వట వృక్ష శాఖలై'...ఒదిగిన …నాతెలుగు భాష...
· ఎన్నో యుగాల ఉనికిని ........
· మరెన్నో ప్రక్రియల పరిమళాన్ని ........
· నా సాహితీ భారతి తనలో కల్పుకొని .......
· వెల్లువలా పెల్లుబికి.. ఘరిలా.. ప్రవహిస్తున్న ..నా 'సాహితీ సరస్వతి' అజరామరమై........
· విశ్వాంతరాల్లో విహరిస్తున్న నా తెలుగు భాష "సూర్యచంద్రాదులు ఉన్నంతవరకు భువిపై నిలిచి ఉండాలని" కోరుకుంటూ..........
· తెలుగు సాహిత్యంపై మీ ఆలోచనలను ..అభిప్రాయాలను...చర్చలను ఆహ్వానిస్తూ సదా తెలుగు అభిమాని !
· - తూర్పింటి నరేశ్ కుమార్