మన మువ్వన్నెల పతాకం

India is best - MOBANGO - Free
mobile applications, games, themes, ringtones, wallpapers and videos
for your mobile phone

5, డిసెంబర్ 2010, ఆదివారం

వినాయక చవితి పండుగ

వినాయక చవితి

ఏదైనా ఒక మంచి పనిని ప్రారంభించేప్పుడు విఘ్నాలు రాకుండా విజయం చేకూర్చమని 
విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థించడం హిందువుల ఆచారం
గజముఖుడైన బొజ్జగణపతి జన్మ ఉత్సవాన్ని భాద్రపద మాసంలో జరుపుకుంటారు. 
ఆయన జన్మదినాన్ని గణేశ చతుర్థి లేదా వినాయక చవితి అని అంటారు.
వినాయక చవితిని దేశమంతటా జరుపుకుంటారు. 
అమితోత్సాహంతో దేశవ్యాప్తంగా జరుపుకునే మన పండుగలలో ప్రధానమైనది వినాయక చవితి.
మహారాష్ట్రలో ఏటా భాద్రపద శుక్ల చతుర్థినాడు గణేశ మహోత్సవం ఆరంభమవుతుంది.
పది రోజులపాటు జరిగే ఈ ఉత్సవం పదకొండవ రోజు అనంత చతుర్దశితో పరిసమాప్త మవుతుంది. ఇళ్ళల్లో చిన్నచిన్న విగ్రహాల రూపాలతో విఘ్నేశ్వరుణ్ణి పూజిస్తారు.
దేవాలయాలలో, బహిరంగ ప్రదేశాలలో పెద్ద పెద్ద విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు జరుపుతారు. పెద్ద విగ్రహాలు దాదాపు ఎనిమిది నుంచి పది మీటర్ల ఎత్తు వరకు ఉంటాయి.
అనంత చతుర్దశినాడు వినాయక నిమజ్జనం జరుపుతారు. ఆరోజు రకరకాల పూలతో, ఫలాలతో, నాణాలతో విఘ్నేశ్వర విగ్రహాలను అందంగా అలంకరించి; కన్నుల పండువగా దీపాలంకరణ చేయబడిన వాహనాలలో భక్తిగీతాలు ఆలపిస్తూ మేళ తాళాలతో ఊరేగింపుగా తీసుకువెళ్ళి నీళ్ళలో నిమజ్జనం చేస్తారు. ముంబాయిలో సముద్రంలో జలనిమజ్జనం చేస్తారు.వినాయకచవితినాడు బియ్యంపిండి, బెల్లం, కొబ్బరి, నువ్వులు కలిపి కుడుములు తయారుచేస్తారు. ఈ కుడుములు వినాయకుడికి ప్రీతిపాత్రమైనవని చెబుతారు. అందుకే విఘ్నేశ్వరుణ్ణి ‘మోదకహస్తుడ’ని కూడా అంటారు. కుడుములు, ఉండ్రాళ్ళు, గుగ్గిళ్ళతోపాటు ఆయా ప్రాంతాలకు చెందిన పిండివంటలు, 
పళ్ళు దేవుడికి నైవేద్యంగా పెడతారు.
ఉత్తర భారత ప్రాంతంలో కరంజీలు, లడ్డూలు, చక్లీలు, కడ్చోలీలు, అనారసలు చేస్తారు. గణేశచతుర్థిని దేశంలో వివిధ ప్రాంతాలలో విభిన్న రీతులలో జరుపుకుంటారు. ఉత్తర ప్రదేశ్‌లో ముత్తయిదువలు రోజంతా ఉప వాసం ఉండి గణపతిని పూజించి చంద్ర వంకను చూశాకే భోజనం చేస్తారు. దక్షణ భారతంలో కూడా గణపతి పూజను ఆసక్తిగా జరుపుకుంటారు.

 

                                కర్నాటక ప్రాంతంలో దీనిని గౌరీ-గణేశ హబ్బగా జరుపుకుంటారు. అంటే పార్వతి, గణపతి పూజలుకలిపి జంటగా జరుపుకుంటారన్నమాట. తమిళనాడులో 
ప్రతి ఇంటా ఈ పండుగ జరుపుకుంటారు. అప్పుడే తయారుచేసిన బంకమన్ను వినాయకుడి బొమ్మను తెచ్చి, జరీ కాగితాలతో తయారు చేసిన గొడుగును అలంకరించి కుడుములు, ఉండ్రాళ్ళు నైవేద్యం
పెట్టి పూజిస్తారు.
                         ఇళ్ళల్లో జరుపుకునే గణేశపూజ సామూహిక ఉత్సవంగా ఎప్పుడు మారిందో తెలుసుకోవాలంటే మనం ఒకసారి గతాన్ని తిరిగి చూడాలి. అది 1894వ సంవత్సరం. మనదేశం ఆంగ్లేయుల పాలనలో అలమటిస్తూన్న కాలం. భవితవ్యం ఏమిటో తెలియకుండా భారత ప్రజలు నిరుత్సాహంతో, నిస్పృహతోవున్న ఆ కాలఘట్టంలో ప్రముఖ కాంగ్రెస్‌ నాయకుడు బాలగంగాధర తిలక్‌ భారత ప్రజలను మేలు కొలపడానికి పూనుకున్నాడు.


                      ఆయన గణేశ చతుర్థిని సామూహిక ఉత్సవంగా మార్చి, అందులో పాలుపంచుకోమని జాతి ప్రజలకు పిలుపునిచ్చాడు. దేశ ప్రజలను సమైక్యపరచి వారిలో జాతీయ, సాంస్కృతిక చైతన్యాన్ని కలిగించడానికి గణేశచతుర్థిని ఒక పరికరంగా ఆయన ఉపయోగించాడు. జాతీయ గీతాలాపనలు, నృత్యాలు, ఉత్సవంలో అంతర్భాగాలయ్యాయి. ప్రేక్షకులలో జాతీయ, దేశభక్తి భావాలు ప్రేరేపించడానికి ‘‘తమాషా!’’ అనే జానపద నాటకాలు ప్రదర్శించేవారు.
ఏనుగు తల ఎలా వచ్చింది?


                       విఘ్నేశ్వరుడికి ఏనుగు తల ఎలా వచ్చిందో మీకు తెలుసా? ఈ వింత విషయాన్ని వివరించే విచిత్రమైన కథలు మన పురాణాలలో చాలా ఉన్నాయి. వాటిలో రెండింటిని ఇక్కడ చూద్దాం : విఘ్నేశ్వరుడు జన్మించినప్పుడు పార్వతీదేవి తన బిడ్డను ఆశీర్వదించమని దేవతలందరినీ ఆహ్వానించింది. అందరూ వచ్చారు. తల్లిని అభినందించి, బిడ్డను ఆశీర్వదించారు. అయితే, ఒక్క శనిభగవానుడు మాత్రం రాలేదు.




ఇది పార్వతికి కొంత ఆశాభంగం కలిగించింది. శనిభగవానుణ్ణి రమ్మని మళ్ళీ ఆహ్వానించింది. ఆయన రానన్నాడు. తనకు ఒక శాపం ఉందనీ, తాను దేనిని చూసినా అది ముక్కలు చెక్కలవుతుందనీ చెప్పాడు. అయినా పార్వతి ఊరుకోలేదు. వచ్చి తన బిడ్డను ఆశీర్వదించమని శనిభగవానుణ్ణి పట్టుపట్టింది.






శనిభగవానుడు అయిష్టంగానే అక్కడికి వచ్చాడు. ఆయన బిడ్డను చూడగానే బిడ్డ తల ముక్కలు చెక్కలుగా బద్దలైపోయింది! శోకంతో పార్వతి హృదయం విలవిలలాడింది. ఆఖరికి దేవగణాలు ఏనుగు తలను తెచ్చి బిడ్డకు అమర్చారు. దేవతలందరూ బిడ్డను భక్తుల కోరికలు తీర్చ తొలిదైవంగా వెలుగొందగలడని ఆశీర్వదించారు! ఇది బ్రహ్మవైవర్త పురాణం చెప్పేకథ!


మరొక సుప్రసిద్ధ పురాణకథ ప్రకారం - పార్వతీదేవి పిండితో కొడుకు బొమ్మనుచేసి, ప్రాణంపోసి, భవన ద్వారంవద్ద కాపలా వుంచి స్నానానికి వెళ్ళిందట. రాక్షస సంహారంచేసి వచ్చిన శివుడు ఆ సంతోషవార్తను భార్యకు చెప్పాలన్న ఉత్సాహంతో లోపలికి ప్రవేశించబోయాడు. కానీ కురవ్రాడు అడ్డుపడడంతో ఆగ్రహంచెందిన శివుడు తన త్రిశూలంతో వాడి తలను తెగగొట్టాడట. పార్వతికి ఈ విషయం తెలియడంతో శోకానలంతో తల్లడిల్లి పోయింది. ఆమెను ఓదార్చడానికి శివుడి ఆజ్ఞ ప్రకారం శివగణాలు - ఏనుగు శిరస్సును తెచ్చి తెగిపడివున్న బిడ్డ శరీరానికి అమర్చారట! ఆ విధంగా గణపతి గజాననుడయ్యాడు!
============తూర్పింటి నరేశ్ కుమార్=======

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి